దుబాయ్ : ఇటీవలే భారత టెస్టు జట్టుకు సారథిగా ఎంపికై ఇంగ్లండ్ పర్యటనలో పరుగుల వరద పారిస్తున్న శుభ్‌మన్ గిల్.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లోనూ సత్తాచాటాడు. తాజాగా విడుదలైన టెస్టు బ్యాటింగ్ ర్యాంకులలో ఏకంగా 25 స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి దూసుకొచ్చాడు.
హెడింగ్లీలో శతకంతో పాటు ఎడ్జ్‌బాస్టన్‌లో రెండు ఇన్నింగ్స్‌లలోనూ సెంచరీల మోత మోగించిన గిల్.. 807 రేటింగ్ పాయింట్లతో స్టీవ్ స్మిత్ (5) తర్వాతి స్థానంలో నిలిచాడు. ఇక భారత్‌తో సిరీస్‌లో రాణిస్తున్న ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్.. 886 పాయింట్లతో రూట్‌ను అధిగమించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.