IND vs AUS : టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (20) ఔటయ్యాడు. మిచెల్ స్టార్క్ ఓవర్లో లబుషేన్ కవర్స్‌లో డైవింగ్ క్యాచ్ పట్టడంతో గిల్ వెనుదిరిగాడు. 39 రన్స్‌కే భారత్ నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం కెప్టెన్ హార్దిక్ పాండ్యా (6), కేఎల్ రాహుల్ (16) క్రీజులో ఉన్నారు. ఒకే ఓవర్లో స్టార్క్, విరాట్ కోహ్లీ(4), సూర్యకుమార్ యాదవ్ (0)ను ఎల్బీగా వెనక్కి పంపాడు. దాంతో, 16 రన్స్ వద్ద భారత జట్టు మూడో వికెట్ పడింది. 13 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 52 రన్స్ చేసింది. భారత జట్టు విజయానికి ఇంకా 137 రన్స్ కావాలి.