న్యూఢిల్లీ: ఐసీసీ మెన్స్ ప్లేయర్ ర్యాంకింగ్స్ రిలీజ్ చేశారు. చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇండియన్ స్టార్.. ఆ లిస్టులో టాప్ నిలిచాడు. రైట్ హ్యాండ్ బ్యాటర్ శుభమన్ గిల్(Shubman Gill).. వన్డేల్లో నెంబర్ వన్ బ్యాటర్ ర్యాంక్ సాధించాడు. పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ ఆజమ్‌ను వెనక్కి నెట్టి గిల్ ఆ ప్లేస్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక వన్డేల్లో టాప్ బౌలర్‌గా శ్రీలంక స్పిన్నర్ మహేశ్ తీక్షణ నిలిచాడు. ఆఫ్ఘన్ బౌలర్ రషీద్ ఖాన్‌ను అతను వెనక్కినెట్టేశాడు. చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కావడానికి ముందు.. ఐసీసీ తాజా వన్డే ర్యాంక్ లిస్టును రిలీజ్ చేసింది.
India’s prolific batter and Sri Lanka’s ace spinner the big winners in the latest ICC Men’s Player Rankings ahead of the #ChampionsTrophy 🏏https://t.co/rUB3vR3dxh
— ICC (@ICC) February 19, 2025
వన్డే క్రికెట్లో శుభమన్ గిల్ నెంబర్ వన్ ర్యాంక్‌లో నిలవడం ఇది రెండోసారి. 2023 ఐసీసీ వరల్డ్‌కప్ సమయంలోనూ.. బాబర్‌ను దాటేసి గిల్ ఆ ర్యాంక్‌ను పొందాడు. గిల్ ప్రస్తుతం టాప్ ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ కొట్టాడు. ఇండియన్ బ్యాటర్ రోహిత్ శర్మ మూడవ స్థానంలో ఉన్నాడు. అయిదో స్థానికి కివీస్ ప్లేయర్ డారెల్ మిచెల్ చేరుకున్నాడు.టాప్ టెన్ ర్యాంకులో లంక బ్యాటర్ అసలంక కూడా చేరుకున్నాడు.
బౌలర్ ర్యాంకింగ్స్‌లో లంక స్పిన్నర్ తీక్షణ దూసుకెళ్తున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన సిరీస్‌లోనూ అతను రాణించాడు. అయితే చాంపియన్స్ ట్రోఫీలో ఆ జట్టు పాల్గొనడం లేదు. కానీ ఇటీవల ఫామ్‌తో అతను అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. రెండో స్థానంలో ఆఫ్ఘన్ స్పిన్నర్ రిజ్వాన్ నిలిచాడు. నాలుగో స్థానంలో కుల్దీప్ యాదవ్, ఆరో స్థానంలో కేశవ్ మహారాజ్, ఏడో స్థానంలో మిచెల్ సాంట్నర్ ఉన్నారు.
ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ మహమ్మద్ నబీ .. వన్డే ఆల్‌రౌండర్ ర్యాంకుల్లో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. టాప్ టెన్‌లోకి సాంట్నర్ వచ్చేశాడు.