న్యూఢిల్లీ: టీమిండియా యువ బ్యాటర్ శుభ్‌మాన్ గిల్ (Shubhaman Gill), యువ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) లు ఐసీసీ (ICC) విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో తమ కెరీర్ అత్యుత్తమ ర్యాంకులు దక్కించుకున్నారు. బుధవారం సాయంత్రం ఐసీసీ వన్డే ఇంటర్నేషనల్స్‌కు సంబంధించిన తాజా ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది.
అందులో శుభ్‌మాన్ గిల్‌కు తన కెరీర్లోనే అత్యుత్తమైన మూడో స్థానం దక్కింది. కెరీర్లోనే అత్యధికంగా 750 రేటింగ్ పాయింట్స్ కూడగట్టుకుని గిల్ ఈ ఘనత సాధించాడు. అదేవిధంగా ఇషాన్ కిషన్ కూడా తన కెరీర్లోనే అత్యుత్తమంగా 24వ ర్యాంకుకు ఎగబాకాడు. మొత్తం 624 రేటింగ్ పాయింట్లతో ఇషాన్ ఈ ఘనత దక్కించుకున్నాడు.
ఆసియాకప్-2023లో భాగంగా నేపాల్‌తో మ్యాచ్‌లో శుభ్‌మాన్ గిల్ 67 పరుగులు, పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ 82 పరుగులు చేశారు. వాళ్లాడిన ఆ ఉత్తమ ఇన్సింగ్సే వారిని కెరీర్ బెస్ట్ ర్యాంకుల్లో నిలబెట్టాయి.