Shubman Gill : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్లోవైభవ్ సూర్యవంశీ(Vaibhav Sooryavanshi) ఆటకు ఫిదా అయిపోయారంతా. ప్రత్యర్ధి ఆటగాళ్లు సైతం ఏమన్న ఆడుతున్నాడా అని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే ‘వైభవ్ నా ఫేవరెట్ క్రికెటర్’ అని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పేర్కొనగా.. ఇప్పుడు భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) సైతం మెచ్చుకున్నాడు. క్వాలిఫయర్ 2లో పదిహేనేళ్ల కుర్రాడి విధ్వంసాన్ని కళ్లారా చూసిన గిల్.. ప్రస్తుతం ప్రపంచంలోనే ఉత్తమ ఆటగాళ్లలో వైభవ్ ఒకడు అని కితాబిచ్చేశాడు.
ఐపీఎల్ 19లో వైభవ్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్‌లకు పలు రికార్డులు దాసోహమయ్యాయి. ప్రపంచస్థాయి బౌలర్లను ఎదుర్కొంటున్నాను? అనే భయమన్నది ఎరుగకుండా సిక్సర్ల మోతతో అలరించిన అతడి ఆటకు శుభ్‌మన్ గిల్ ఫ్యాన్ అయిపోయాడు. క్వాలిఫయర్ 2లో గుజరాత్ టైటాన్స్‌పై సీనియర్లు విఫలమైనా వైభవ్ ఎంతో ఓపికగా.. ఆపై దూకుడుగా ఆడినఇన్నింగ్స్ చూసిన గిల్ ప్రశంసించకుండా ఉండలేకపోయాడు.
🚨 SHUBMAN GILL SAID ABOUT ON WIN AGAINST RR AND VAIBHAV SURYAVANSHI 🚨
Shubman Gill said 🗣️,
“It was a complete team performance today. We felt the pressure when Vaibhav started striking the ball so well, as he can completely change the momentum of the match. His wicket… pic.twitter.com/ko34rIW4wF
— Cricket Central (@CricketCentrl) May 9, 2026
‘ఈ సీజన్ వైభవ్‌కు గుర్తుండి పోతుందని అనుకుంటున్నా. ఇప్పటివరకూ అతడిలా ఆడే బ్యాటర్‌ను నేను చూడలేదు. ఈ క్షణం.. ప్రపంచంలోని ఉత్తమ బ్యాటర్లలో వైభవ్ ఒకడు. అతడి ఆట ఎంతో అద్భుతం. హిట్టింగ్ ఒక్కటే కాదు.. అతడిలో భయమే లేదు. అందరూ ఆకాశానికెత్తేస్తున్నా అతడు చాలా ప్రశాంతంగా మైదానంలోకి దిగి మమ్మల్ని ఒత్తిడిలో పడేశాడు. రాబోయే రోజుల్లో వైభవ్ ఆటతో ప్రత్యర్థి జట్లకు ఇబ్బందులు తప్పకపోవచ్చు’ అని గిల్ పేర్కొన్నాడు.

ఎలిమినేటర్‌లో పంజా విసిరిన రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫయర్ 2లో తేలిపోయింది. ముల్లన్‌పూర్‌లో వైభవ్ సూర్యవంశీ(96) విధ్వంసంతో 214 రన్స్ కొట్టినా.. బౌలర్ల వైఫల్యంతో ఆ జట్టును ముంచింది. భారీ ఛేదనలో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన శుభ్‌మన్ గిల్(104) శతకంతో రెచ్చిపోగా మూడో ఫైనల్ ఆడాలనుకున్న రాజస్థాన్ కల చెదిరింది.
పంతొమ్మిదో సీజన్లో ఆరెంజ్ క్యాప్ విజేత ఎవరు? అనేది ఆసక్తి రేపుతోంది. ఎలిమినేటర్, క్వాలిఫయర్ 2లో శతకం చేజార్చుకున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 776 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ అతడికి గట్టి పోటీ ఇస్తున్నారు. రాజస్థాన్‌పై సెంచరీతో గిల్ ఏడొందల క్లబ్లో చేరగా.. అర్ధ శతకంతో మెరిసిన సుదర్శన్ సైతం రేసులోకి దూసుకొచ్చింది. ఐపీఎల్ ఒకే సీజన్లో ముగ్గురు ఆటగాళ్లు 700లకు పైగా పరుగులు సాధించడం ఇదే మొదటిసారి. దాంతో, ఈ ముగ్గురిలో ఆరెంజ్ విజేత ఎవరో ఫైనల్ మ్యాచ్‌తో తేలిపోనుంది.