చెన్నై: ఇండియన్ ఓపెనింగ్ బ్యాటర్ శుభమన్ గిల్(Shubman Gill).. డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో అతను ఆదివారం ఆస్ట్రేలియాతో జరగనున్న వరల్డ్‌కప్ మ్యాచ్‌లో ఆడకపోవచ్చు అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల కాలంలో గిల్ వన్డేల్లో అద్భుతమైన బ్యాటింగ్‌ను ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. జ్వరంతో బాధపడుతున్న గిల్‌కు శుక్రవారం పరీక్షలు చేపట్టారని, ఆ టెస్టుల్లో అతనికి డెంగ్యూ ఉన్నట్లు తేలిందని కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది.
సాధారణ జ్వరం వస్తే యాంటిబయాటిక్స్ తీసుకుని అతను ఆడే ఛాన్సు ఉందని, కానీ ప్రస్తుతం వైద్య బృందం సలహా మేరుకు అతన్ని ఆడించే అవకాశం ఉంటుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఒకవేళ జ్వరం వల్ల గిల్ మ్యాచ్‌కు దూరం అయితే, అతని స్థానంలో ఇషాన్ కిషన్‌ను రంగంలోకి దించే అవకాశాలు ఉన్నాయి.
ఈ ఏడాది వన్డేల్లో గిల్ టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. అతను 72.35 యావరేజ్‌తో 1230 రన్స్ చేశాడు. అతని స్ట్రయికింగ్ రేట్ 105గా ఉంది. దాంట్లో అయిదు సెంచరీలు, అయిదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 208 రన్స్ టాప్ స్కోర్.