బ్రినిడాడ్: పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ ఆజమ్ పేరిట ఉన్న వన్డే రికార్డును ఇండియన్ బ్యాటర్ శుభమన్ గిల్(Shubman Gill) బ్రేక్ చేశాడు. వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో సరికొత్త మైలురాయిని గిల్ అందుకున్నాడు. నిజానికి ఆ మ్యాచ్‌లో ఇండియా ఓడినా.. గిల్ మాత్రం తన పేరిట ఓ రికార్డును పదిలం చేసుకున్నాడు. వన్డేల్లో ఇప్పటి వరకు 26 ఇన్నింగ్స్‌లు ఆడిన గిల్.. మొత్తం 1352 రన్స్ చేశాడు. అయితే 50 ఓవర్ల ఫార్మాట్లో బాబర్ ఆజమ్ 26 ఇన్నింగ్స్‌లో 1322 రన్స్ చేశాడు. రెండో వన్డేలో 34 రన్స్ చేసిన గిల్ ఆ మైలురాయిని దాటేశాడు. దీంతో మొన్నటి వరకు బాబర్ పేరిట ఉన్న అత్యధిక రన్స్ రికార్డును ఇప్పుడు గిల్ బ్రేక్ చేశాడు. గిల్, బాబర్ తర్వతా స్థానాల్లో జొనాథన్ ట్రాట్(1303), ఫకర్ జమాన్(1275), వాండర్ దుస్సేన్(1267) ఉన్నారు.