Shubman Gill : ఇంగ్లండ్ పర్యటనలో శుభ్‌మన్ గిల్ (Shubman Gill) పరుగుల ప్రవాహానికి హద్దే లేకుండా పోయింది. లీడ్స్‌లో సెంచరీతో ఇంగ్లండ్ బౌలర్లకు గుబులు పుట్టించిన భారత సారథి.. ఎడ్జ్‌బాస్టన్‌లోనూ డబుల్ సెంచరీతో జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆతిథ్య జట్టు బౌలింగ్ దళాన్ని చీల్చి చెండాడుతూ అర్ధ శతకంతో కదం తొక్కాడు ప్రిన్స్. టీమిండియా నాయకుడిగా అతడికిది మూడో ఫిఫ్టీ.
కెప్టెన్సీ వచ్చాక ఎంతటి ఆటగాడైనా జాగ్రత్తగా ఆడతాడు. తన వికెట్ కాపాడుకుంటూ జట్టును పటిష్ట స్థితిలో ఉంచేందుకు ప్రయత్నిస్తాడు. కానీ, గిల్ అలా కాదు. డిఫెన్స్‌లో పడి ప్రత్యర్థికి ఛాన్స్ ఇవ్వడం అతడికసలు నచ్చదు. అందుకే.. కెప్టెన్‌గా ఎంపికయ్యాక ఒత్తిడికి లోనయ్యే రకం కాదని చాటుతూ వరుసగా రికార్డుల దుమ్ముదులుపుతున్నాడీ యువతరంగం. టెస్టు పగ్గాలు అందుకున్న తొలి మ్యాచ్‌లోనే శతకంతో మెరిసిన అతడు.. ఎడ్జ్‌బాస్టన్‌లో వీరవిహారం చేశాడు.
What a statement Shubman Gill has given with the bat in his first series as captain, so far ⚡🔥#ShubmanGill #ENGvIND pic.twitter.com/I9Xt9Wg5Wj
— Cricbuzz (@cricbuzz) July 5, 2025
తొలి ఇన్నింగ్స్‌లో 269 పరుగులతో కెరియర్లో మొదటి ద్విశతకం సాధించిన గిల్.. ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక స్కోర్ బాదిన భారత కెప్టెన్‌గా చరిత్రకెక్కాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ హాఫ్ సెంచరీతో విజృంభించిన అతడు.. సారథిగా తొలి సిరీస్‌లో మరే భారతీయుడికి సాధ్యంకాని రికార్డు నెలకొల్పాడు. నాయకుడిగా అత్యధిక పరుగులతో విరాట్ కోహ్లీ పేరిట ఉన్న 11 ఏళ్ల రికార్డును బ్రేక్ చేశాడు. 2014లో ఆస్ట్రేలియా సిరీస్‌తో పగ్గాలు అందుకున్న విరాట్ 449 పరుగులతో చరిత్ర సృష్టించాడు.