మనామా (బహ్రెయిన్): ఆసియా యూత్ గేమ్స్‌లో భారత మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ) యువ ఫైటర్ శ్రీయ మిలింద్ రజతం గెలుచుకుంది. గర్ల్స్ 50 కిలోల ఫైనల్లో ఆమె.. కజకిస్థాన్ అమ్మాయి అమెలినా బకియెవ చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. ఈ విజయంతో శ్రీయ.. ఈ టోర్నీ చరిత్రలో పతకం గెలిచిన తొలి భారత మహిళా ఎంఎంఏ ఫైటర్‌గా రికార్డులకెక్కింది. ఈ టోర్నీలో భారత్ ఇప్పటికే 2 స్వర్ణాలు, 6 రజతాలు, 8 కాంస్యాల (మొత్తం 16 పతకాలు)తో ఆరో స్థానంలో ఉంది.