బెంగళూరు: గాయం కారణంగా వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) సీజన్‌కు పూర్తిగా దూరమైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ స్థానంలో స్నేహ్‌రానా జట్టులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని శనివారం ఆర్సీబీ ఒక ప్రకటనలో పేర్కొంది.
30 లక్షల ధరతో స్నేహ్‌రానా..ప్రస్తుత సీజన్లో ఆర్సీబీకి ఆడనుంది. గాయం కారణంగా ఇటీవల స్వదేశంలో వెస్టిండీస్, ఐర్లాండ్‌తో పా టు తాజాగా డబ్ల్యూపీఎల్‌కు శ్రే యాంక పూర్తిగా దూరమైంది. డిఫెండింగ్ చాంపియన్ ఆర్సీబీ..తమ తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ అద్భుత విజయంతో బోణీ కొట్టిన సంగతి తెలిసిందే.