Japan Open | వెంటాడిన భుజం గాయం.. సాత్విక్ – చిరాగ్ జోడీ నిష్క్రమణ..!
Japan Open : జపాన్ ఓపెన్‌లో దుమ్మురేపాలనుకున్న భారత డబుల్స్ ద్వయం కల చెదిరింది. టోర్నీలో ఫేవరెట్ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జంట అనూహ్యంగా తొలి రౌండ్లోనే నిష్క్రమించింది.
Japan Open : జపాన్ ఓపెన్‌లో దుమ్మురేపాలనుకున్న భారత డబుల్స్ ద్వయం కల చెదిరింది. టోర్నీలో ఫేవరెట్ అయిన సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జంట అనూహ్యంగా తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. మొదటి మ్యాచ్‌లోనే సాత్విక్ సాయిరాజ్‌కు భుజం గాయం తిరగబెట్టడంతో ఇక ఆడలేమంటూ.. తొలి ఈ స్టార్ జోడీ కోర్టును వీడింది. దాంతో.. డెన్మార్క్ జంటను విజేతగా ప్రకటించారు నిర్వాహకులు.
ఫేవరెట్‌గా జపాన్ ఓపెన్ బరిలో నిలిచిన సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి ద్వయం తొలి మ్యాచ్‌తోనే ఇంటిదారి పట్టింది. డెన్మార్క్ ఆటగాళ్లు డానియెల్ లుండ్‌గార్డ్ – మాడ్స్ వెస్టెర్గార్డ్తో మ్యాచ్ సమయంలో సాత్విక్ కుడి భుజం గాయంతో ఇబ్బందిపడ్డాడు. నొప్పి కారణంగా అతడు ఆటను కొనసాగించలేకపోయాడు. దాంతో.. భారత జంట టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.
🩹 Looks like the right shoulder is still bothering Satwik. After dropping a super close opening game 19-21, he indicates to the umpire he can’t continue and Satwik-Chirag retire from their R32 match.
Big tournaments coming up, so hopefully he feels fine soon. pic.twitter.com/Tl4fgjp7Zp
— Vinayakk (@vinayakkm) July 14, 2026
ఈ ఏడాది పలుమార్లు సాత్విక్ భుజం గాయంతో బాధపడ్డాడు. మార్చి నెలలో ఇదే సమస్యతో సాత్విక్ చిరాగ్ ద్వయం స్విట్జర్లాండ్ ఓపెన్ నుంచి ఇంటొకొచ్చేసింది. ఏప్రిల్‌లో బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్షిప్స్.. అనంతరం ఇండోనేషియా ఓపెన్‌లో సైతం వీరు ఆడలేదు. అయితే.. థామస్ కప్‌లో కాంస్యం.. సింగపూర్ ఓపెన్‌లో టైటిల్ విజయంతో దారిలో పడిన ఈ జంట.. జపాన్ ఓపెన్‌ను బాధతో వీడక తప్పలేదు. అసియా క్రీడల్లో పతకమే లక్ష్యంగా పెట్టుకున్న సాత్విక్ – చిరాగ్ .. అంతకంటే ముందే బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పోటీపడనున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

