SAW vs BANW : వరల్డ్ కప్‌లో బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమవుతున్న బంగ్లాదేశ్ (Bangladesh) ఈసారి అదరగొట్టింది. దక్షిణాఫ్రికా బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొన్న టాపార్డర్ శుభారంభం ఇవ్వగా.. మిడిలార్డర్ బ్యాటర్లు రాణించారు. సఫారీల కట్టుదిట్టమై బౌలింగ్ కారణంగా ఒకదశలో స్వల్ప స్కోర్‌కే పరిమితమయ్యేలా కనిపించింది బంగ్లా. కానీ, షోర్నా అక్తర్ (51 నాటౌట్), షమీన్ అక్తర్(50)లు అర్ధ శతకాలతో మెరవడంతో .. పోరాడగలిగే స్కోర్ చేసింది. డెత్ ఓవర్లలో రీతూ మోని(19 నాటౌట్)తో కలిసి షొర్నా బౌండరీలతో చెలరేగింది. వీరిద్దరూ అజేయంగా 27 జోడించగా.. బంగ్లా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది.
వైజాగ్ స్టేడియంలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్‌కు ఓపెర్లు శుభారంభమిచ్చారు. దక్షిణాఫ్రికా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న ఫర్గనే హక్ (30), రుబియా హైదర్ (25)లు తొలి వికెట్‌కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. పవర్ ప్లే తర్వాత జోరు పెంచాలనుకున్న ఈ ద్వయాన్ని చోలే ట్రయాన్ విడదీసింది. అనంతరం వచ్చిన షమీన్ అక్తర్(50) సమయోచితంగా ఆడుతూ స్కోర్‌బోర్డును నడింపించింది. సఫారీలు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా.. కెప్టెన్ నిగర్ సుల్తానా(32)లతో కీలకమైన 77 పరుగులు జోడించింది. అయితే.. హాఫ్ సెంచరీ తర్వాత దూకుడుగా ఆడాలనుకున్న షమీన్ 43వ ఓవర్లో అనూహ్యంగా రనౌటయ్యింది. అప్పటికీ బంగ్లా స్కోర్ 164.
Shorna Akter smashed the fastest fifty by a Bangladesh batter in women’s ODIs to breathe a new life into this game ⚡
Follow LIVE ▶️ https://t.co/EsW7bQitQO pic.twitter.com/rMWbgAWEtU
— ESPNcricinfo (@ESPNcricinfo) October 13, 2025
ప్రధాన బ్యాటర్లు ఔటైన వేళ జట్టుకు పోరాడగలిగే స్కోర్ అందించే బాధ్యత తీసుకుంది షొర్నా అక్తర్(51 నాటౌట్ :35 బంతుల్లో 3 ఫోర్లు3 సిక్సర్లు). సెఖుఖునే వేసిన 46వ ఓవర్లో రెచ్చిపోయింది. వరుసగా 6, 4, 4 తో 18 పరుగులు పిండుకుంది. ఆ తర్వాతి ఓవర్లో శోభన మోస్త్రే(9) డైరక్ట్ త్రోకు రనౌటయ్యింది. అనంతరం వచ్చిన రబెయా ఖాన్(0) సైతం గోల్డెన్ డక్‌గా వెనుదిరగడంతో ఆరు వికెట్లు పడ్డాయి. అయినా సరే రీతూ మోని(19 నాటౌట్), షొర్నా పెద్ద షాట్లతో స్కోర్ వేగాన్ని పెంచారు. మరినే కాప్ వేసిన 48వ ఓవర్లో మిని హ్యాట్రిక్ ఫోర్లు బాదగా.. చివరి ఓవర్లో రెండు పరుగులతో షొర్నా అర్ధ శతకం పూర్తి చేసుకుంది. ప్రపంచకప్‌లో ఆమెకిదో మొదటి హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఆఖరి ఓవర్లో 9 రన్స్ రావడంతో.. బంగ్లా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేయగలిగింది.
A moment to remember forever 💚| Shorna Akter’s maiden World Cup fifty — pure emotion, pure pride. She bows in gratitude, carrying the dreams of a nation. 🇧🇩✨
Photo Credit: ICC/Getty#Bangladesh #TheTigress #BCB #Cricket #WomenWorldCup #Cricket #TigressForever… pic.twitter.com/cKD9FAoS92
— Bangladesh Cricket (@BCBtigers) October 13, 2025