BANW vs AUSW : వరల్డ్ కప్‌లో రెండో విజయం కోసం శ్రమిస్తున్న బంగ్లాదేశ్ (Bangladesh) స్వల్క స్కోర్‌కే పరిమితమైంది. ఆస్ట్రేలియా బౌలర్లను దీటుగా ఎదుర్కొని ఓపెనర్ రుబియా హైదర్(44) శుభారంభమిచ్చినా మిడిలార్డర్ వైఫల్యంతో చూస్తుండగానే ఆరు వికెట్లు కోల్పోయింది. ఆ దశలో శోభన మోస్త్రే(66 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడింది. ఓవైపు వికెట్లు పడుతున్నా వెరవకుండా క్రీజులో నిలిచిన తను డాన్సీ బ్రౌన్ వేసిన 40వ ఓవర్లో మూడు బౌండరీలతో జట్టు స్కోర్ 150 దాటించింది. అజేయంగా నిలిచిన మేస్త్రీ జట్టుకు పోరాడగలిగే స్కోర్ అదించింది. దాంతో, ఈ వరల్డ్ కప్‌లో మొదటిసారిగా ప్రత్యర్థిని ఆలౌట్ చేయలేకపోయింది ఆసీస్.
ప్రపంచ కప్‌లో బౌలింగ్‌లో రాణిస్తూ.. బ్యాటింగ్‌లో తేలిపోతున్న బంగ్లాదేశ్ కీలక మ్యాచ్‌లోనూ స్వల్ప స్కోర్‌తోనే సరిపెట్టుకుంది. వైజాగ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లా.. 198 పరుగులే చేయగలిగింది. టాపార్డర్‌లో ఓపెనర్ రుబియా హైదర్(44) రాణించగా.. అషే గార్డ్నర్(2-48) ధాటికి మిడిలార్డర్ కుప్పకూలింది. 131 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఆలౌట్ అంచున నిలిచింది బంగ్లా. 150లోపే ఆ జట్టు చాపచుట్టేయడం ఖాయమనిపించింది. కానీ, శోభన మోస్త్రీ (66 నాటౌట్) పట్టుదలగా క్రీజులో నిలిచి ఆసీస్ బౌలర్లకు సవాల్ విసిరింది.
Unbeaten and unshaken 💚 | Sobhana Mostary stays till the end with a classy 66* — a true Tigress at the crease! 🇧🇩🔥
Photo Credit: ICC/Getty#Bangladesh #TheTigress #BCB #Cricket #WomenWorldCup #Cricket #TigressForever #WomenWorldCup2025 #CWC25 pic.twitter.com/tOCyevUfFV
— Bangladesh Cricket (@BCBtigers) October 16, 2025
సహచరులు ఇలా వచ్చి అలా డగౌట్ చేరుతున్నా శోభన మాత్రం ఒత్తిడికి లోనవ్వలేదు. షోర్నా అక్తర్(7), ఫాహిమా ఖాతూన్(4)లతో కలిసి జట్టును ఆదుకోవాలనుకన్న ఆమె ప్రయత్నాలను అలనా కింగ్ భగ్నం చేసింది. ఈ ఇద్దరై ఔటయ్యాక.. రబెయా ఖాన్(6) అండతో గౌరవప్రదమైన స్కోర్ అందించాలనుకున్న శోభన.. డాన్సీ బ్రౌన్ వేసిన 40వ ఓవర్లో మూడు ఫోర్లతో స్కోర్ 150 దాటించింది. ఆతర్వాత కూడా అదే జోరు చూపించిన తను.. గార్డ్నర్ బౌలింగ్‌లో బౌండరీతో ఈ టోర్నీలో రెండో అర్ధ శతకం సాధించింది. చివరి రెండు ఓవర్లలో 22 రన్స్ రాబట్టడంతో బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి198 పరుగులు చేయగలిగింది.