IPL 2024 SRH vs CSK : ఉప్పల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు దంచికొడుతున్నారు. హైదరాబాద్ పేసర్లను ఉతికారేస్తున్న శివం దూబే(45), అజింక్యా రహానే(34)లు పరుగుల వరద పారిస్తున్నారు. దాంతో సీఎస్కే స్కోర్ 12 ఓవర్లకే వంద దాటింది. ఈ జోడీ ఇప్పటికే 35 బంతుల్లో 61 రన్స్ చేసింది. 13 ఓవర్లకు స్కోర్.. 115/2.
Muscled not once but TWICE 💥💥
Shivam Dube on a roll in Hyderabad! 🔥
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #SRHvCSK | @IamShivamDube pic.twitter.com/0odsO9hgAv
— IndianPremierLeague (@IPL) April 5, 2024
టాస్ ఓడిన చెన్నైకు సన్రైజర్స్ హైదరాబాద్కు పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆదిలోనే షాక్ ఇచ్చాడు. డేంజరస్ ఓపెనర్ రచిన్ రవీంద్ర(12)ను ఔట్ చేశాడు. రచిన్ భారీ షాట్ ఆడబోయి మర్క్రమ్ చేతికి చిక్కాడు. దాంతో, 25 పరుగుల వద్ద సీఎస్కే తొలి వికెట్ కోల్పోయింది. ఆ కాసేపటికే రుతురాజ్ గైక్వాడ్(26)ను షహ్బాజ్ అహ్మద్ వెనక్కి పంపాడు. 54 పరుగులకే రెండు వికెట్లు పడిన సీఎస్కేను రహానే, దూబేలు ఆదుకున్నారు.