వాంగ్జు: ఆర్చరీలో శీతల్ దేవి(Sheetal Devi) ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. 18 ఏళ్ల ఆ భారతీయ క్రీడాకారిణి.. పారా ప్రపంచ ఆర్చరీ పోటీల్లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నది. రెండు చేతులు లేని శీతల్.. తన కాళ్లతోనే బాణాన్ని వదిలి .. ప్రపంచ క్రీడల్లో పతకాన్ని చేజిక్కించుకున్నది. టర్కీకి చెందిన వరల్డ్ నెంబర్ వన్ క్రీడాకారిణి జోజ్నుర్ క్యూర్ గిర్డీపై 146-143 పాయింట్లతో విజయం సాధించింది. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత కేటగిరీలో శీతల్ దేవి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నది.
పారా వరల్డ్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో శీతల్ దేవి ఒక్కరే చేతులు లేని క్రీడాకారిణి. ఆ దివ్యాంగ క్రీడాకారిణి .. గ్వాంగ్జులో అందర్నీ స్టన్ చేసింది. తన పాదం, గదవతో .. శీతల్ తన బాణాన్ని షూట్ చేస్తుంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మూడోసారి శీతల్ దేవి మెడల్‌ను గెలుచుకున్నది. మిక్స్డ్ టీమ్ బ్రాంజ్ కాంపౌండ్ ఈవెంట్లో తోమన్ కుమార్‌తో కలిసి పతకాన్ని సాధించింది.
SHEETAL DEVI IS WORLD CHAMPION 🏆🥇🇮🇳 ✌🏻🎊😭
🏹Our Sheetal Defeated Paralympics & World champion Cure Girdi Oznur 🇹🇷 (146-143) to win her 1st Global Title 🥇 !!
🇮🇳 & Sheetal Medals : 🥇🥈🥉
Sheetal is 1st Female Armless Archer to win World title 🥇🇮🇳#ParaArchery pic.twitter.com/RHy3JkqirT
— Navin Mittal (@NavinSports) September 27, 2025