డోర్నకల్, జనవరి 20: జాతీయస్థాయి ఫుట్‌బాల్ అండర్-19 టోర్నీకి మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిల్కోడు మోడల్ స్కూల్ విద్యార్థి షణ్ముఖ ప్రియ ఎంపికైంది. రంగారెడ్డి జిల్లాలో జరిగిన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైందని ఫిజికల్ డైరెక్టర్ గోవర్ధన్‌రావు తెలిపారు. ఈనెల 23 నుంచి 28 వరకు మణిపూర్ రాష్ట్రంలోని ఇంఫాల్‌లో జరుగననున్న నేషనల్ టోర్నీలో షణ్ముఖ పోటీపడనుంది.