ఢిల్లీ: ఇప్పటికే ప్రపంచ అగ్రశ్రేణి సంస్థలు స్పాన్సర్ చేస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)తో మరో దిగ్గజ కంపెనీ జతకట్టింది. ఏఐ రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న గూగుల్ ఏఐ ప్లాట్‌ఫామ్ ‘జెమిని’.. ఐపీఎల్‌తో జట్టుకట్టింది. రాబోయే సీజన్ నుంచి మూడేండ్ల కాలానికి గాను జెమిని.. ఐపీఎల్లో స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. ఈ మేరకు బీసీసీఐతో రూ. 270 కోట్ల ఒప్పందం కుదిరినట్టు బోర్డు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. జెమినికి పోటీదారుగా ఉన్న ‘చాట్‌జీపీటీ’ డబ్ల్యూపీఎల్‌లో స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నది.