వడోదరా: మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ గాడిలో పడింది. మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన పోరులో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. ముంబై నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ మరో ఓవర్ మిగిలుండగానే 3 వికెట్లు కోల్పోయి విజయాన్నందుకుంది. కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్(51 నాటౌట్) అజేయ అర్ధసెంచరీతో రాణించింది. అమన్‌జ్యోత్, వైష్ణవి ఒక్కో వికెట్ తీశారు. తొలుత ముంబై నాట్‌సీవర్(65) అర్ధసెంచరీతో ముంబై 20 ఓవర్లలో 154/5 స్కోరు చేసింది. శ్రీచరణి(3/33)మూడు వికెట్లు తీసింది.