సౌతాంప్టన్: వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భాగంగా భారత్‌తో జరుగుతున్న టెస్టులో న్యూజిలాండ్ ఆరో వికెట్ కోల్పోయింది. టీమ్ఇండియా పేసర్ మహ్మద్ షమీ వేసిన 83వ ఓవర్లో గ్రాండ్‌హోం(13) ఔటయ్యాడు. మ్యాచ్‌లో అతనికిది మూడో వికెట్ కావడం విశేషం. లంచ్ విరామానికి ముందు తొలి సెషన్లో మూడు వికెట్లు పడగొట్టిన భారత్ ఆ తర్వాత మరో వికెట్ తీసి మ్యాచ్‌పై పట్టుబిగించింది. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ నిదానంగా ఆడుతూ పరుగులు సాధిస్తున్నాడు. కేన్(32)తో పాటు కైల్ జేమీసన్(14) క్రీజులో ఉన్నారు. 86 ఓవర్లకు కివీస్ 6 వికెట్లకు 180 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 37 పరుగులు వెనుకబడి ఉంది.
Plenty of "make it large moments" on Day 5 as three wickets were taken quickly by India:
— ICC (@ICC) June 22, 2021
💥 Ross Taylor caught by Shubman Gill
💥 Ishant Sharma gets Henry Nicholls
💥 BJ Watling caught by Mohammad Shami#WTC21 Final | #INDvNZ | @royalstagmil pic.twitter.com/eiC1iHpx8I