దుబాయ్: భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ(Mohammed Shami)కి రెస్ట్ ఇవ్వనున్నారు. చాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో.. షమీ లేకుండానే టీమిండియా బరిలోకి దిగనున్నది. పాకిస్థాన్‌తో మ్యాచ్ సమయంలో షమీ పిక్క కండరాలు పట్టేసిన విషయం తెలిసిందే. దీంతో అతనికి రెస్ట్ ఇవ్వాలని టీం మేనేజ్మెంట్ ఆలోచిస్తున్నది. అయితే ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో.. షమీ స్థానంలో హర్షదీప్‌కు ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నారు.
బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కల్ సమక్షంలో హర్షదీప్ శుక్రవారం ప్రాక్టీస్ చేశాడు. ప్రాక్టీస్ సెషన్లో హర్షదీప్ 13 ఓవర్లు బౌల్ చేశాడు. షమీ మాత్రం 7 ఓవర్లు బౌల్ చేసినట్లు తెలుస్తోంది. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం మూడు ఓవర్లు వేయగానే.. షమీ తన కుడి కాలి కోసం ఫిజియో చికిత్స తీసుకున్నాడు. అయితే కీలకమైన సెమీస్ మ్యాచ్ ముందు.. షమీకి రెస్ట్ ఇవ్వాలని టీం మేనేజ్మెంట్ భావిస్తున్నది. బౌలింగ్ లైనప్‌లో స్వల్పంగా తేడా ఉంటుందని అసిస్టెంట్ కోచ్ రియాన్ డోస్చే తెలిపారు.