Mohammad Shami : భారత సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ (Mohammad Shami) తన ఫిట్‌నెస్‌పై వస్తున్న తప్పుడు వార్తలకు చెక్ పెట్టాడు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar)ను పునరాలోచనలో పడేస్తూ రంజీ ట్రోఫీ (Raji Trophy)లో నాలుగు వికెట్లతో చెలరేగాడు. బెంగాల్ తరఫున బరిలోకి దిగిన ఈ స్పీడ్‌స్టర్ ఉత్తరాఖండ్ బ్యాటర్లను వణికించాడు. నాలుగు కీలక వికెట్లు పడగొట్టి బెంగాల్ విజయంలో కీలక పాత్ర పోషించాడీ వెటరన్. మ్యాచ్ విన్నింగ్ స్పెల్ ద్వారా తన ఫిట్‌నెస్‌పై పనిగట్టుకొని అబద్ధాలు ప్రచారం చేస్తున్న అగార్కర్‌కు గట్టి కౌంటర్ ఇచ్చాడీ పేస్ గన్.
‘నేను ఫిట్గాలేనని, ఫామ్‌లో లేనని చీఫ్ సెలెక్టర్ అంటున్నాడు. ఒకవేళ ఫిట్ నిరూపించుకొని ఉంటే ఆసీస్ పర్యటనకు తీసుకునేవాళ్లమని కూడా ఆయన అన్నాడు. కానీ, నేను ఫిట్‌గానే ఉన్నా. ఆయనకు తోచిన విధంగా నా గురించి మాట్లాడుతున్నాడు. మీరు నా బౌలింగ్ చూశారు. బెంగాల్ విజయంలో కీలకపాత్ర పోషించాను. నా ఫిట్‌నెస్‌కు మీరే సాక్ష్యం’ అని మ్యాచ్ అనంతరం అగార్కర్‌కు కౌంటర్ ఇచ్చాడు భారత సీనియర్ పేసర్.
Mohammed Shami starts the Ranji season with a powerful performance for Bengal. The day is not too far when he will be back in the Indian team.
(He bowled 39.3 overs across both innings and picked up 7 wickets, including the Player of the Match award)#MohammedShami pic.twitter.com/SjxksY11DX
— CricTracker (@Cricketracker) October 18, 2025
చివరి రోజైన శనివారం ఉత్తరాఖండ్ జట్టు 165/2తో ఇన్నింగ్స్ ఆరంభించింది. కెప్టెన్ కునాల్ ఛండేలా (68 నాటౌట్), భూపేన్ లల్వానీ (12 నాటౌట్) జట్టును గట్టెక్కించే దిశగా సాగుతున్నారు. అయితే.. బంతి అందుకున్న షమీ.. ఫటాఫట్ వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఛండేలాను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న అతడు.. అభయ్ నేగీ, జన్మేజయ్, రజన్ కుమార్‌లను ఔట్ చేసి ఉత్తరాఖండ్ నడ్డివిరిచాడు.
Md Shami bowling against Uttarakhand
3/37 in 14.5 overs#AUSvsIND #ViratKohli #RanjiTrophy pic.twitter.com/JsB2lwojoa
— its Shruti (@Shruti_v31) October 16, 2025
24.2 ఓవర్లో 38 రన్స్ మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసిన షమీకి ఆకాశ్ దీప్, ఇషాన్ పొరెల్ తోడవ్వగా 265కే ప్రత్యర్థి ఇన్నింగ్స్ ముగిసింది. అనంతరం ఇన్నింగ్స్ కొసాగించిన బెంగాల్ 156 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలి ఇన్నింగ్స్‌లో మూడు, రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన షమీ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.