Duleep Trophy : భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ (Mohammad Shami) దేశవాళీలో సత్తా చాటేందుకు సిద్దమవుతున్నాడు. మోకాలి గాయం తర్వాత జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన ఈ స్పీడ్‌స్టర్ దులీప్ ట్రోఫీ(Duleep Trophy)లో వికెట్ల వేటతో టీమిండియా తలుపు తట్టాలనే కసితో ఉన్నాడు. ఇషాన్ కిషన్ సారథ్యంలో ఈస్ట్ జోన్ తరఫున బరలోకి దిగనున్నాడు షమీ. ఐపీఎల్లో రెండో వేగవంతమైన శతకంతో రికార్డు సృష్టించిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi), రియాన్ పరాగ్‌లు కూడా స్క్వాడ్‌లో ఉన్నారు.
ఐపీఎల్‌తో ఫామ్ అందుకున్న ఇషాన్‌కే ఈస్ట్ జోన్ పగ్గాలు అప్పగించడంతో.. సీనియర్ ప్లేయర్ అభిమన్యు ఈశ్వరన్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. స్క్వాడ్‌లోని షమీకి 34 ఏళ్లు కాగా.. వైభవ్‌కు 14 సంవత్సరాలు మాత్రమే. ఇరవై ఏళ్ల వయోభేదం ఉన్న ఈ ఇద్దరూ ఒకే జట్టుకు ఆడుతుండడం విశేషం. అయితే.. రంజీ ట్రోఫీలో నిరుడు బెంగాల్ తరఫున అత్యధిక రన్స్ బాదిన సుదీప్ చటర్జీని సెలెక్టర్లు పక్కన పెట్టేశారు.
🚨 BREAKING 🚨
East Zone has announced its squad for the Duleep Trophy 2025. ⚡#Cricket #Ishan #India #DuleepTrophy pic.twitter.com/Yzo9fOUpEe
— Sportskeeda (@Sportskeeda) August 1, 2025
ఈస్ట్ జోన్ స్క్వాడ్ : ఇషాన్ కిషన్(కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్(వైస్ కెప్టెన్), సందీప్ పట్నాయక్, విరాట్ సింగ్ డెనిశ్ దాస్ శరందీప్ సింగ్ కుమార్ కుషగ్ర, రియాన్ పరాగ్, ఉత్కర్ష్ సింగ్, మనీషి, సూరజ్ సింధు జైస్వాల్, ముకేశ్ కుమార్, ఆకాశ్ దీప్, షమీ.
స్టాండ్ బై ప్లేయర్లు : ముఖ్తర్ హుసేన్, ఆశీర్వాద్ స్వేన్, వైభవ్ సూర్యవంశీ, సాత్విక్ సమాల్, సుదీప్ కుమార్ ఘరమి, రాహుల్ సింగ్.
దేశవాళీ సీజన్ 2025-26 దులీప్ ట్రోఫీతో ప్రారంభం కానుంది. చాలా సీజన్ల తర్వాత ఆరు జోన్లతో నిర్వహిస్తున్న ఈ ట్రోఫీ ఆగస్టు 28న షురూ అవుతుంది. జాతీయ జట్టులో చోటు ఆశిస్తున్న ఇషాన్ కిషన్, షమీలకు ఈ టోర్నీ కీలకం. ఐపీఎల్ 18వ సీజన్లో ఇద్దరూ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడారు. కిషన్ మెరుపు సెంచరీతో అదరగొట్టినా.. ఆ తర్వాత తేలిపోయాడు. లీగ్ మ్యాచ్‌ల ఆఖర్లో మళ్లీ ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్ ఝులిపించాడంతే. షమీ విషయానికొస్తే.. ఆరు వికెట్లతో తీవ్రంగా నిరాశపరిచాడు. సో.. డొమెస్టిక్ క్రికెట్లో ఫామ్ చాటుకొని.. టీమిండియా జెర్సీ వేసుకోవాలని ఇద్దరూ భావిస్తున్నారు. ఇద్దరికీ ఆల్ ది బెస్ట్ చెబుదామా.