Bangladesh : ఆసియా కప్(Asia Cup), వన్డే వరల్డ్ కప్(ODI World Cup) ముందు బంగ్లాదేశ్(Bangladesh)కు కొత్త తలనొప్పి మొదలైంది. వన్డే కెప్టెన్‌గా ఉన్న తమీమ్ ఇక్బాల్(Tamim Iqbal) బాధ్యతల నుంచి తప్పుకోవడమే అందుకు కారణం. వెన్నుముక గాయం కారణంగా అతను ఆసియా కప్‌లో కూడా ఆడనని చెప్పేశాడు. దాంతో, బంగ్లా క్రికెట్ బోర్డు కొత్త సారథి వేటలో పడింది. గతంలో జట్టును అద్భుతంగా నడిపించిన షకిబుల్ హసన్(Shakib al Hasan)వైపు సెలెక్టర్లు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.
అంతకంటే ముందు అతడి నిర్ణయం తెలుసుకోవాలని బీసీబీ అధ్యక్షుడు నజ్ముల్ హుసేన్ భావిస్తున్నాడట. అయితే.. ప్రస్తుతం వైస్ కెప్టెన్‌గా ఉన్న లిట్టన్ దాస్(Litton Das)కు పగ్గాలు అప్పగిస్తారనే వార్తలు వినిపించాయి. కానీ, అనూహ్యంగా షకిబుల్ పేరు తెరపైకి వచ్చింది.
లిట్టన్ దాస్, తమీమ్ ఇక్బాల్
‘కెప్టెన్‌గా ఎవరిని నియమించాలి? అనేదానిపై ఇంకా చర్చించలేదు. త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. ఒక్క సిరీస్ అయితే వైస్ కెప్టెన్‌తో నడిపించేవాళ్లం. కానీ, ఆసియా కప్, వరల్డ్ కప్ (ODI World Cup)వంటి ప్రధాన టోర్నీలు ఉన్నాయి. అందుకని దీర్ఘకాల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని కెప్టెన్‌ను ఎంపిక చేయాల్సి ఉంది’ అని నజ్ముల్ ఓ ప్రకటనలో తెలిపాడు.
గతంలో షకిబుల్ హసన్(Shakib al Hasan) బంగ్లా వన్డే జట్టుకు సారథిగా ఉన్నాడు. అతడి నాయకత్వలోనే బంగ్లాదేశ్ 2011 వరల్డ్ కప్‌లో ఆడింది. అయితే.. అతను ప్రస్తుతం టెస్టులు, టీ20 కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అతడి నేతృత్వంలో బంగ్లాదేవ్ పొట్టి ఫార్మాట్లో వరుసగా మూడు సిరీస్‌లు గెలిచింది. ఈ ఏడాది ఆసియా కప్ ఆగస్టు 30న మొదలవ్వనుంది. భారత గడ్డపై వన్డే వరల్డ్ కప్ అక్టోబర్ 5న ఆరంభం కానుంది.
షకిబుల్ హసన్
అంతేకాదు అన్ని ఫార్మాట్లలో ఐదు కంటే ఎక్కువ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'(Player Of The Series) అవార్డులు అందుకున్న మొదటి క్రికెటర్‌గా షకిబుల్ హసన్ ఈమధ్యే రికార్డు సృష్టించాడు. ఒకవేళ మళ్లీ అతడిని వన్డే సారథిగా ప్రకటిస్తే.. మళ్లీ భారత గడ్డపై ప్రపంచ కప్‌లో బంగ్లాను నడించనున్నాడు.