ముంబై: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది(Shahid Afridi).. నైరోబీలో శ్రీలంకతో జరిగిన వన్డేలో.. కేవలం 37 బంతుల్లో సెంచరీ కొట్టాడు. అయితే ఆ మ్యాచ్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బ్యాట్‌ను షాహిద్ అఫ్రిది వాడినట్లు తెలిసింది. అఫ్రిది ఆ సమయంలో రికార్డు నెలకొల్పినా.. దాన్ని కోరే అండర్సన్, ఏబీ డివిల్లీర్స్ బ్రేక్ చేశారు. కానీ సూపర్‌ఫాస్ట్‌గా సెంచరీ కొట్టిన షాహిద్ అఫ్రిది ..ఆ ఇన్నింగ్స్‌తో సూపర్ స్టార్ అయిపోయాడు. 37 బంతుల్లో సెంచరీ చేసిన సందర్భంలో సచిన్ బ్యాట్‌ను వినియోగించినట్లు స్వయంగానే అఫ్రిది గతంలో వెల్లడించాడు.
సెంచరీ కొట్టిన ఆ బ్యాట్‌ను తన వద్దే సురక్షితంగా ఉంచుకున్నట్లు చెప్పాడు. అది సచిన్ బ్యాట్ అని, అతను తన ఫెవరేట్ ప్లేయర్ అని, అతని బ్యాట్‌తో వరల్డ్ రికార్డు క్రియేట్ చేసినట్లు అఫ్రిది తెలిపాడు. వకార్ యూనిస్ కూడా థ్యాంక్స్ చెబుతున్నానని, ఎందుకంటే ఆ బ్యాట్‌ను అతను తనకు ఇచ్చినట్లు చెప్పాడు. మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఆ బ్యాట్ ఇచ్చినట్లు గుర్తు చేశాడు. సచిన్ బ్యాట్ ఆడమని వకార్ చెప్పినట్లు అఫ్రిది తెలిపాడు. ఆ బ్యాట్‌తో ఆడేందుకు తర్వాత ప్రయత్నించానని, కానీ ఆ తర్వాత దాన్ని దాచుకున్నట్లు చెప్పాడు.
పాకిస్థాన్ జట్టు మాజీ ప్లేయర్ అజర్ మహమూద్ కూడా అఫ్రిది ఇన్నింగ్స్ గురించి కొన్ని విషయాలు తెలిపాడు. సచిన్ బ్యాట్‌ను ఎలా వాడాల్సి వచ్చిందో అతను కూడా వివరించాడు. ఆ రోజుల్లో లంక ఓపెనర్లు జయసూర్య , కలువితరణ.. ఆర్డర్లో ముందు వచ్చి హిట్టింగ్ చేసేవాళ్లు అని, అందుకే ఆ తరహాలోనే అఫ్రిదిని మూడవ నెంబర్లో బ్యాటింగ్‌కు దించామని అజర్ మహమూద్ తెలిపాడు. హిట్టింగ్ చేయాలని వసీం అక్రమ్ చెప్పాడని, దాంట్లో అఫ్రిది స్పిన్నర్లను వేటాడినట్లు చెప్పాడు.
శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో అఫ్రిది మూడవ నెంబర్లో బ్యాటింగ్ చేస్తారని, సచిన్ నుంచి తెచ్చిన బ్యాట్‌ను వకార్ అతనికి ఇచ్చాడని, ఆ బ్యాట్‌తో అఫ్రిది సెంచరీ చేశాడని, ఇక ఆ తర్వాత అతని కెరీర్ మారిపోయిందని మహమూద్ తెలిపాడు. 1996లో సెంచరీ కొట్టిన అఫ్రిది వీడియో మళ్లీ వైరల్ అవుతున్నది.
#OnThisDay in 1996. The day Shahid Afridi smashed 11 sixes and took only 37 balls to reach a ODI century.
Afridi when speaking about this innings “when I’m not performing well with the bat I watch my 37 ball hundred on youtube” #Cricket pic.twitter.com/48hLfuKa26
— Saj Sadiq (@SajSadiqCricket) October 4, 2023