Bangladesh | రావల్పిండి : పాకిస్థాన్‌తో రావల్పిండి వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో బంతితో విఫలమైన బంగ్లాదేశ్ బ్యాట్‌తో పోరాడుతోంది. పాకిస్థాన్ చేసిన భారీ స్కోరు (448/6)కు దీటుగా బదులిస్తూ తొలి ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ షద్మన్ ఇస్లాం(93) తృటిలో శతకాన్ని కోల్పోగా మోమినుల్ హక్ (50) రాణించాడు.
ముష్పీకర్ రహీమ్ (55 నాటౌట్), లిటన్ దాస్ (52 నాటౌట్) క్రీజులో ఉన్నారు. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై పాక్ బ్యాటర్ల మాదిరిగానే బంగ్లా ఆటగాళ్లు నిలకడగా పరుగులు రాబడుతున్నారు. మొదటి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు ఇంకా 132 పరుగులు వెనుకబడే ఉంది.