అమెరికా టెన్నిస్ సంచలనం, ఎందరికో స్ఫూర్తిదాయకమైన సెరెనా విలియమ్స్.. తనకు ఎంతో ఇష్టమైన టెన్నిస్ క్రీడకు వీడ్కోలు పలికింది. ఇరవై మూడు గ్రాండ్ స్లామ్ సింగిల్స్ ఛాంపియన్ అయిన ఈ టెన్నిస్ స్టార్.. యూఎస్ ఓపెన్ తర్వాత తను ఇక టెన్నిస్ ఆడబోనని ప్రకటించింది. 1995లో ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్‌గా మారిన సెరెనా.. ఆ తర్వాత ఎన్నో కీర్తిశిఖరాలు అధిరోహించింది.
అక్క వీనస్ విలియమ్స్‌తో కలిసి డబుల్స్ టైటిల్స్ కూడా సాధించింది. తాజాగా వోగ్ ఆర్టికల్‌లో తన రిటైర్మెంట్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘నాకు రిటైర్మెంట్ అనే పదం ఇష్టం ఉండదు. నా నిర్ణయాన్ని స్పష్టంగా వివరించాలంటే.. పరిణామం (ఎవల్యూషన్) అని చెప్తాం. టెన్నిస్‌కు దూరంగా, నాకు ముఖ్యమైన ఇతర విషయాల్లో పరిణామం చెందుతున్నా’’ అని పేర్కొంది.