Wimbledon doubles : దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరీనా విలియమ్స్ రీఎంట్రీ ఇచ్చింది. సోదరి వీనస్ విలియమ్స్‌తో కలిసి త్వరలో వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో బరిలోకి దిగనుంది. టెన్నిస్ ప్రపంచంలో అత్యంత విజయవంతమైన జోడీల్లో ఒకటైన విలియమ్స్ సిస్టర్స్ మరోసారి గ్రాండ్‌స్లామ్ వేదికపై సందడి చేయనున్నారు. మంగళవారం విడుదలైన మహిళల డబుల్స్ వైల్డ్ కార్డ్ జాబితాలో సెరీనా-వీనస్ జోడీకి చోటుదక్కింది.
సెరీనా విలియమ్స్ 2022 యూఎస్ ఓపెన్ తర్వాత గ్రాండ్‌స్లామ్ టోర్నీల నుంచి విరామం తీసుకుంది. ఇటీవలే క్వీన్స్ క్లబ్ ఛాంపియన్‌షిప్‌లో కెనడాకు చెందిన విక్టోరియా మోబోకోతో కలిసి రీఎంట్రీ ఇచ్చింది. అయితే భాగస్వామి గాయపడటంతో ఆ జోడీ టోర్నీలో ఎక్కువరోజుఅఉ కొనసాగలేకపోయింది. కాగా వింబుల్డన్‌కు ముందు బెర్లిన్ ఓపెన్‌లో కరోలినా ముచోవాతో కలిసి సెరెనా ఆడనుంది. టెన్నిస్ చరిత్రలో విలియమ్స్ సిస్టర్స్ జోడీకి ప్రత్యేక స్థానం ఉంది.
ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్లలో కలిసి పోటీ పడి అద్భుత విజయాలు సాధించారు. మహిళల డబుల్స్‌లో ఏకంగా 14 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలుచుకున్నారు. అయితే వీరిద్దరూ కలిసి ఆడిన 14 మ్యాచ్‌లలో అన్నింట్లోనూ విజేతలుగా నిలవడం విశేషం. సెరెనా శక్తివంతమైన బేస్ లైన్ ఆట, వీనస్ ఆల్‌రౌండ్ నైపుణ్యంతో ప్రత్యర్థులకు ఎన్నోసార్లు చుక్కలు చూపించారు. ఇప్పుడు మరోసారి ఈ జోడీ వింబుల్డన్ గ్రాస్ కోర్టులపై కలిసి అడుగుపెట్టనుండటం అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది.