న్యూయార్క్: సెర్బియా టెన్నిస్ స్టార్ నోవాక్ జొకోవిచ్..యూఎస్ ఓపెన్‌లో అదిరిపోయే రీతిలో శుభారంభం చేశాడు. గతేడాది టోర్నీకి దూరమైన జొకో తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు.
పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో జొకోవిచ్ 6-0, 6-2, 6-3తో అలెగ్జాండర్ ముల్లర్‌పై అలవోక విజయం సాధించాడు. తనదైన జోరు కనబరిచిన జొకో..తొలి సెట్‌ను 23 నిమిషాల్లోనే సొంతం చేసి తన పవర్ ఏంటో చూపెట్టాడు.