Football Coach Died : ఫుట్‌బాల్ మైదానంలో విషాదం నెలకొంది. సెర్బియా దేశానికి చెందిన ఫుట్‌బాల్ కోచ్ మ్లాదెన్ జిజోవిక్ (Mladen Zizovic) మ్యాచ్ సమయంలో మరచించాడు. సూపర్ లిగా మ్యాచ్ జరుగుతుండగా.. జిజోవిక్ ఉన్నచోటనే కుప్పకూలాడు. వెంటనే సిబ్బంది అతడిని ఆస్పత్రికి తరలించినా అప్పటికే చనిపోయాడని వైద్యులు తెలిపారు. దాంతో.. అప్పటివరకూ తమతో మాట్లాడుతూ.. ఉత్సాహపరుస్తూ సందడి చేసిన కోచ్ ఇక లేరనే వార్తను ఆటగాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు.
సెర్బియాలోని రడ్నికి 1923 అనే క్లబ్ జట్టుకు కోచ్‌గా పనిచేస్తున్నాడు మ్లాడెన్ జిజోవిక్. సోమవారం సెర్బియా సూపర్ లిగాలో మ్లాడొస్ట్ లుకానితో మ్యాచ్ జరుగుతోంది. ఆట మొదలైన 22వ నిమిషంలో జిజోవిక్ ఉన్నట్టుండి మైదానంలో కుప్పకూలాడు. అతడలా కిందపడిపోవడం గమనించిన సహచరులు మైదానంలోనే చికిత్స అందించారు. ఆ తర్వాత అతడిని సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. జజోవిక్ను హాస్పిటల్ తీసకెళ్లిన తర్వాత మ్యాచ్‌ను యథావిధిగా కొనసాగించారు. అయితే.. అతడు మరణించిన వార్త తెలియనగానే షాక్‌కు గురైన ఇరుజట్ల ఆటగాళ్లు మ్యాచ్ రద్దు చేసుకున్నారు.
🇷🇸 Serbian football coach dies during SuperLiga match
Mladen Žižović, the 44-year-old head coach of Serbian club Radnički, collapsed during a SuperLiga match while his team led 2–0. He was rushed to the hospital but could not be revived.
Upon learning of his death, players… pic.twitter.com/zQcN8Eefen
— Visegrád 24 (@visegrad24) November 4, 2025
జజోవిక్ మరణవార్తను ఎక్స్ వేదికగా పంచుకుంది క్లబ్. అందులో.. ‘మనసునిండా బాధాతో అభిమానులు, క్రీడాకారులకు హెడ్‌కోచ్ మ్లాడడెన్ జజోవిక్ చనిపోయారనే వార్తను తెలియజేస్తున్నాం. ఆయన సోమవారం రాత్రి మ్యాచ్ జరుగుతుండగా మరణించారు. మా క్లబ్ గొప్ప కోచ్‌ను కోల్పోయింది. అంతకంటే ముఖ్యంగా మంచి మనిషి, స్నేహితుడు, క్రీడల్ని ప్రేమించే వ్యక్తి మనకు దూరమయ్యాడు. ఆయన తన నైపుణ్యం, విలువలతో మా అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు’ అని రాడ్నికి 1923 క్లబ్ తమ పోస్ట్‌లో పేర్కొంది. 44 ఏళ్లున్న జజోవిక్ అకస్మిక మృతికి గుండెపోటు కారణమని తెలుస్తోంది.