Euro Cup | మునిచ్: జర్మనీ ఆతిథ్యమిస్తున్న ప్రతిష్టాత్మక యూరో కప్‌లో సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. శనివారం రాత్రి స్విట్జర్లాండ్‌తో ఆద్యంతం ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌ను ఇంగ్లండ్ గెలుచుకోగా టర్కీని నెదర్లాండ్స్‌ను ఓడించి సెమీస్‌కు దూసుకెళ్లాయి. ఇంగ్లండ్-స్విట్జర్లాండ్ మ్యాచ్ నిర్ణీత సమయానికి 1-1తో సమమైంది. కానీ పెనాల్టీ షూటౌట్లో ఇంగ్లండ్ 5 గోల్స్ చేయగా స్విస్ జట్టు 3 గోల్స్‌కే పరిమితమై ఓటమి వైపున నిలిచింది. నాలుగో క్వార్టర్స్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 2-1తో టర్కీని ఓడించింది. బుధవారం నుంచి మొదలయ్యే తొలి సెమీస్‌లో స్పెయిన్.. ఫ్రాన్స్‌ను ఢీకొననుండగా గురువారం నెదర్లాండ్స్, ఇంగ్లండ్ మధ్య రెండో సెమీస్ జరుగనుంది.
ముగిసిన రజావత్ పోరాటం
కాల్గరీ (కెనడా): కెనడా ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ ప్రియాన్షు రజావత్ పోరాటం సెమీస్‌లోనే ముగిసింది. టోర్నీ ఆసాంతం తనకంటే మెరుగైన ర్యాంకర్లను ఓడించి సంచలనాలు నమోదుచేసిన రజావత్ కీలక సెమీస్‌లో మాత్రం చేతులెత్తేశాడు. ఆదివారం జరిగిన పురుషుల సెమీఫైనల్లో రజావత్ 17-21, 10-21తో అలెక్స్ లేనియర్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయాడు. 45 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో ఆది నుంచే అలెక్స్ ధాటిగా ఆడి వరుస సెట్లతో పాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకుని ఫైనల్ చేరాడు.