Mohammad Shami : ఒకప్పుడు భారత జట్టు ప్రధాన పేస్ అస్త్రమైన పేసర్ మహమ్మద్ షమీ (Mohammad Shami)కి మరోసారి చుక్కెదురైంది. దేశవాళీ క్రికెట్లో వికెట్లు తీస్తూ నిలకడగా రాణిస్తున్నా సరే అతడిని సెలెక్టర్లు పట్టించుకోవడం లేదు. న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌కు శనివారం ఎంపిక చేసిన స్క్వాడ్‌లో ఈ స్పీడ్‌స్టర్ పేరు లేదు. జస్ప్రీత్ బుమ్రా (Jasprrit Bumrah) గైర్హాజరీలో షమీకి చోటు దక్కుతుందని అందరూ అనుకున్నారు. కానీ, సెలెక్టర్లు మాత్రం మరోసారి ఈ దిగ్గజ బౌలర్‌కు అన్యాయం చేశారు. దాంతో.. ఇక అతడి కెరీర్ ముగిసిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఒకప్పుడు ప్రధాన పేసర్‌గా టీమిండియా విజయాల్లో కీలకమైన షమీ ఇప్పుడు ఒక్క ఛాన్స్ కోసం చకోర పక్షిలా నిరీక్షిస్తున్నాడు. మూడేళ్ల క్రితం వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లతో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అందుకున్న ఈ వెటరన్ బౌలర్.. జట్టుకు దూరమై రెండేళ్లు అవుతోంది. మోకాలి సర్జరీ నుంచి కోలుకొని ఫిట్నెస్ సాధించిన షమీకి సెలెక్టర్లు చుక్కలు చూపిస్తున్నారు.
-17 wickets in 2015 WC
– 14 wickets in 2019 WC
– 24 wickets in 2023 WC
– 7/57 in 2023 WC Semi Final
– Hattrick in World Cup
– Champions Trophy winner
– 229 wickets in TestsThank You M Shami ❤️
pic.twitter.com/FGKKxTzg9Y— ❖ Abhijeet 45 ❖ (@Abhijeet042729) January 3, 2026
ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(SMAT), విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy)లో ఐదు మ్యాచుల్లో 12 వికెట్లతో చెలరేగాడీ స్పీడ్‌స్టర్. దాంతో.. ఐసీసీ టోర్నీల్లో నిప్పులు చెరిగే షమీని వన్డే ప్రపంచకప్ కోసమైనా న్యూజిలాండ్ సిరీస్‌కు ఎంపిక చేస్తాడని ఊహించారంతా. కానీ, బుమ్రా బదులు సిరాజ్‌కు ఓటేసిన సెలెక్టర్లు హర్షిత్ రానా, అర్ష్‌దీప్ సింగ్‌లను తీసుకున్నారు. అంతే.. ఈసారైనా టీమిండియాకు ఆడే అవకాశం వస్తుందని భావించిన షమీ కలలు కల్లలయ్యాయి.
🚨 NO MOHAMMED SHAMI IN TEAM INDIA AGINST NZ ODI SERIES. 🚨
Shami in SMAT & VHT.
– 2/14 Vs J&K.
– 3/69 Vs Chandigarh.
– 1/42 Vs Baroda.
– 2/65 Vs Vidarbha.
– 4/30 Vs Haryana12 wickets in 5 match still not Selected. 🤯
What’s your opinion on this. 🤔pic.twitter.com/FZ67VPW2X3
— Sam (@Cricsam01) January 3, 2026
స్వదేశంలో వన్డే ప్రపంచకప్ ముగిశాక.. మోకాలి గాయం నుంచి కోలుకున్న షమీ.. నిరుడు ఆస్ట్రేలియా పర్యటనతో పునరాగమనం చేయాలని అనుకున్నాడు. కానీ, అతడికి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) భారీ షాకిచ్చాడు. ఫిట్నెస్ లేనందునే తనను ఎంపిక చేయలేదని అగార్కర్ చెప్పడంపై షమీ మండిపడ్డాడు. రంజీ ట్రోఫీ (Raji Trophy)లో బెంగాల్ తరఫున తొలి మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లతో చెలరేగాడు.
– Dropped Ruturaj after a hundred.
– Picked Pant over Ishan/ Jurel/ Sanju who are in better form.
– Ignored Shami.
– Picked 4 Pacers including Prasidh.
– Picked NKR for no reason.1 like = 1 slap for The Biggest Culprit of 🇮🇳 Cricket – Ajit Agarkar. 🤡 pic.twitter.com/1753hlQIKr
— Pratyush Halder (@pratyush_no7) January 3, 2026
‘నేను ఫిట్గాలేనని, ఫామ్‌లో లేనని చీఫ్ సెలెక్టర్ అంటున్నాడు. ఒకవేళ ఫిట్ నిరూపించుకొని ఉంటే ఆసీస్ పర్యటనకు తీసుకునేవాళ్లమని కూడా ఆయన అన్నాడు. కానీ, నేను ఫిట్‌గానే ఉన్నా. ఆయనకు తోచిన విధంగా నా గురించి మాట్లాడుతున్నాడు. మీరు నా బౌలింగ్ చూశారు. బెంగాల్ విజయంలో కీలకపాత్ర పోషించాను. నా ఫిట్‌నెస్‌కు మీరే సాక్ష్యం’ అని మ్యాచ్ అనంతరం అగార్కర్‌కు కౌంటర్ ఇచ్చాడు భారత సీనియర్ పేసర్.