పారిస్ : ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో పురుషుల టాప్‌సీడ్ కార్లోస్ అల్కారజ్, మహిళల రెండో సీడ్ అరినా సబలెంక మూడో రౌండ్‌కు చేరుకున్నారు. సీడెడ్ ఆటగాళ్లు త్సిసిపాస్, కరెన్ కచనొవ్, డెనిస్ షపొవలొవ్, మహిళల విభాగంలో జెస్సికా పెగ్యులా, డారియా కసట్కిన, అనస్తాసియా పొటపోవ, ఇరినా కామెలినా బెగు ముందంజ వేశారు. కాగా సీడెడ్లు సెబాస్టియన్ కోర్డా, క్విన్వెన్ జంగ్, లుడ్మిలా శాంసనోవా, కరోలిన్ గార్సియా, జెలెనా ఒస్టాపెంకొ ఇంటిబాటపట్టారు.
టైటిల్ గెలుస్తాడనుకుంటున్న స్పెయిన్ యువ ఆటగాడు అల్కారజ్ 6-1, 3-6, 6-1, 6-2తో జపాన్‌కు చెందిన టారొ డేనియల్‌పై విజయం సాధించి మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. అల్కారజ్ రెండు ఏస్లతోపాటు, రెండు అనవసర తప్పిదాలు చేయగా, టారొ అయిదు అనవసర తప్పిదాలు చేశాడు. తొలి సెట్ గెలుచుకున్న అల్కారజ్‌కు షాక్ ఇస్తూ టారొ రెండో సెట్ గెలుచుకుని సమ ఉజ్జీగా నిలిచాడు. అయి తే అల్కారజ్ ప్రత్యర్థికి మరో అవకాశమీయక తరువాతి రెండు సెట్లను గెలుచుకుని ముందంజవేశాడు. ఇతర మ్యాచ్‌లలో కరెన్ కచనొవ్ 6-3, 6-4, 6-2తో రదు అల్బాట్పై, డెనిస్ సపొవలొవ్ 6-2, 3-6, 6-3, 6-3తో మాటియొ అర్నాల్డిపై, డిగొ స్వార్జ్‌మన్ 7-6(7-3), 6-4, 6-3తో నునొ బోర్గెజ్పై గెలుపొందారు.