అమ్స్టెల్వీన్: ఎఫ్ఐహెచ్ మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారత్‌రెండో రౌండ్లో అడుగుపెట్టింది. తమకంటే మెరుగైన ర్యాంకర్ ఇంగ్లండ్‌తో గురువారం జరిగిన పూల్-డీ ఆఖరి మ్యాచ్‌ను 0-0తో డ్రాగా ముగించింది. రెండో రౌండ్ వెళ్లేందుకు అవసరమైన పాయింట్ అందుకుంది.ఈ మ్యాచ్‌లో ఇంగ్లిష్ సాధించిన 11 పెనాల్టీ కార్నర్లను భారత గోల్‌కీపర్లు సవితా పునియా, బిచూ దేవి అద్భుతంగా తిప్పికొట్టారు. ముఖ్యంగా మ్యాచ్ ముగియడానికి మరో 30 సెకన్ల సమయం ఉందనగా బిచూచేసిన అద్భుత సేవ్‌తో భారత్ రెండో రౌండ్ బెర్తు సొంతం చేసుకుంది.
అయితే ఈ మ్యాచ్‌లో లభించిన 6 పెనాల్టీ కార్నర్లను దీపిక, నవ్‌నీత్ కౌర్ గోల్స్‌గా మలచడంలో విఫలమయ్యారు. ఆట 4వ నిమిషంలో నవ్‌నీత్ కొట్టిన షాట్ ఇషికా స్టిక్‌ను తాకుతూ నెట్లోకి వెళ్లినప్పటికీ ఆ గోల్‌ను అంపైర్లు తిరస్కరించారు. తొలి రౌండ్లో ఓ విజయం, రెండు డ్రాలతో భారత్ రెండో స్థానంలో నిలవగా.. మరో పోరులో 5-1తో దక్షిణాఫ్రికాను ఓడించిన చైనా అగ్రస్థానం అందుకుంది.