SCOvsNAM | టీ20 వరల్డ్ కప్లో భాగంగా అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్లో స్కాట్లాండ్పై నమీబియా విజయం సాధించింది. స్కాట్లాండ్ నిర్దేశించిన 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 5 బంతులు మిగిలి ఉండగానే చేధించింది. 4 వికెట్ల తేడాతో స్కాట్లాండ్పై గెలిచింది.
టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన స్కాట్లాండ్ ఆరంభం నుంచే తడబడింది. నమీబియా బౌలర్లు విజృంభించడంతో తొలి ఓవర్లోనే మూడు వికెట్లు కోల్పోయింది. మైకేల్ లీస్క్ (44), క్రిస్ గ్రీవ్స్ (25) ఆదుకోవడంతో స్కాట్లాండ్ ఓ మోస్తరు పరుగులు చేయగలిగింది. మిగిలిన ప్లేయర్లంతా విఫలం కావడంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి స్కాట్లాండ్ 109 పరుగులు మాత్రమే చేయగలిగింది. నమీబియా బౌలర్లలో రూబెన్ ట్రంపెల్మన్ 3, జాన్ ఫ్రైలింక్ 2, జేజే స్మిత్, డేవిడ్ వీజ్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన నమీబియా ఆటగాళ్లు నిలకడగా ఆడుతూ లక్ష్యాన్ని చేధించారు.