మెల్బోర్న్: ఆస్ట్రేలియా స్పీడ్ బౌలర్ స్కాట్ బోలాండ్ నిప్పులు చెరిగాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా జరిగిన మూడవ టెస్టులో ఇంగ్లండ్ నడ్డీ విరిచాడు. ఆస్ట్రేలియా పిచ్‌లపై ఇంగ్లండ్ బ్యాటర్లు మళ్లీ మళ్లీ విఫలమవుతున్నారు. మరో వైపు ఆస్ట్రేలియా బౌలర్లు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు. ఆసీస్ జట్టులో మార్పులు జరుగుతున్నా కొద్దీ.. ఆ జట్టు బౌలింగ్ మరింత బలపడుతోంది. మెల్బోర్న్లో జరిగిన మూడవ టెస్టు కోసం గాయపడ్డ జోష్ హేజల్‌వుడ్ స్థానంలో స్కాట్ బోలాండ్‌ను తీసుకున్నారు. అయితే ఈ సిరీస్‌లో తెగ ఇబ్బంది పడుతున్న ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్‌కు బోలాండ్ మరో షాకిచ్చాడు. తన పేస్ బౌలింగ్‌తో స్కాట్ ఇంగ్లండ్ బ్యాటర్లను కుప్పకూల్చాడు. రెండవ ఇన్నింగ్స్ కేవలం ఏడు పరుగులు ఇచ్చి ఆరు వికెట్లను తీశాడు.
In 2018, Scott Boland travelled to the UK to retrace the footsteps of Johnny Mullagh and the 1868 Aboriginal XI.
— Cricket Australia (@CricketAus) December 28, 2021
Today, he won the award named in Mullagh's honour, on Test debut against England 🖤💛❤️ #Ashes pic.twitter.com/1hxwCl3vmI
స్వంత గ్రౌండ్లో ఆడుతున్న బోలాండ్.. మూడవ టెస్టులో మొత్తం ఏడు వికెట్లు తీసుకున్నాడు. వుడ్‌ను ఔట్ చేసిన అతను టెస్టుల్లో తొలి అయిదు వికెట్ల ఘనతను సాధించాడు. బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడంలో బోలాండ్ అద్భుత ప్రదర్శన తోడైంది. ఫుల్ లెన్త్ బౌలింగ్‌తో ఇంగ్లండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఆస్ట్రేలియా తరపున ఆడుతున్న స్థానిక తెగకు చెందిన రెండవ క్రికెటర్‌గా బోలాండ్ నిలిచాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును బోలాండ్ గెలిచాడు. అతనికి ముల్లాగ్ మెడల్‌ను ఇచ్చారు. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం నాలుగు ఓవర్లలో బోలాండ్ ఆరు వికెట్లు తీయడం విశేషం. దాంట్లో ఓ ఓవర్ మేడిన్ వేశాడు. 19 బంతులు వేసి అయిదు వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలోనూ బోలాండ్ నిలిచాడు. గతంలో ఎర్నీ టోషాక్, స్టువర్ట్ బ్రాడ్లు 19 బంతులు వేసి అయిదు వికెట్లు తీశారు.