హైదరాబాద్, ఆట ప్రతినిధి: భారత బ్యాడ్మింటన్ డబుల్ ప్లేయర్ రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. గురువారం ఉదయం సాత్విక్ తండ్రి ఆర్ కాశీ విశ్వనాథన్ (65) గుండెపోటుతో మృతి చెందారు.
గతంలో ఆయన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా పని చేసి రిటైర్డ్ అయ్యారు. ఢిల్లీలో 43వ పీఎస్‌పీబీ ఇంటర్-యూనిట్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పాల్గొనేందుకు వెళ్లిన సాత్విక్.. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన తన స్వస్థలం అమలాపురం బయల్దేరాడు.