హాంగ్జౌ: ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్‌లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ సంచలనం సృష్టించారు. పురుషుల డబుల్స్‌లో ఈ భారత జోడీ సెమీస్‌కు దూసుకెళ్లింది.
గ్రూప్-బీ మూడో మ్యాచ్‌లో సాత్విక్, చిరాగ్.. 17-21, 21-18, 21-15తో ఆరోన్ చియ, సోవూయిక్ (మలేషియా) ను ఓడించి ఈ టోర్నీలో సెమీస్ చేరిన తొలి భారత పురుషుల డబు ల్స్ జోడీగా సరికొత్త రికార్డు నెలకొల్పారు. తద్వారా సైనా నెహ్వాల్, పీవీ సింధు, జ్వాలా-దిజు తర్వాత ఈ టోర్నీలో సెమీస్ చేరిన షట్లర్లుగా నిలిచారు.