కంటోన్మెంట్, డిసెంబర్ 9 : విశాఖపట్నం వేదికగా జరుగుతున్న 63వ జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్రానికి చెందిన సాత్విక్ మూడు పతకాలతో సత్తాచాటాడు. సికింద్రాబాద్ కంటోన్నెంట్ అన్నానగర్‌కు చెందిన సాత్విక్..స్కేటింగ్ పెయిర్లో స్వర్ణం, క్యాడెట్లో రతజం, సోలో కేటగిరీలో కాంస్యం సొంతం చేసుకున్నాడు.
ప్రత్యర్థులకు దీటైన పోటీనిస్తూ సాత్విక్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. అర్జున అవార్డు గ్రహీత అనూప్‌కుమార్ దగ్గర సాత్విక్ శిక్షణ తీసుకుంటున్నాడు.