ఢిల్లీ: బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ర్యాంకు చేజిక్కించుకున్న భారత స్టార్ ద్వయం సాత్విక్‌సాయిరాజ్-చిరాగ్‌శెట్టి అగ్రస్థానాన్ని కోల్పోయారు. తాజా ర్యాంకులలో భారత జోడీ.. రెండు స్థానాలు కోల్పో యి (93,720 పాయింట్లు) మూడో స్థానానికి పడిపోయింది.
గత నెలలో థాయ్‌లాండ్ ఓపెన్ గెలిచి మొదటి స్థానానికి చేరిన సాత్విక్ ద్వయం.. సింగపూర్ ఓపెన్‌లో విఫలమవగా ఇండోనేషియా, ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి తప్పుకున్నారు. 1,01,718 పాయింట్లతో చైనా జంట లియాంగ్ వీ కెంగ్ – వాంగ్ చెంగ్ మొదటి ర్యాంక్‌కు దూసుకెళ్లగా డెన్మార్క్ ఆటగాళ్లు కిమ్ అస్ట్రప్ – అండర్స్ స్కారుప్ (95,153) నాలుగో ర్యాంక్ నుంచి రెండో ర్యాంక్‌కు ఎగబాకారు. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ ప్లేయర్ హెచ్ఎస్ ప్రణయ్ (10), లక్ష్యసేన్ (14) టాప్-15లో కొనసాగుతున్నారు. మహిళల సింగిల్స్ ర్యాంకులలో పీవీ సింధు 12వ ర్యాంక్‌లో ఉంది.