Satwik – Chirag | ఆసియా ఛాంపియన్షిప్స్ నుంచి వైదొలిగిన సాత్విక్ – చిరాగ్ జోడీ.. ఆ ఇద్దరిపైనే ఆశలన్నీ..!
Satwik - Chirag : భారత స్టార్ డబుల్స్ ఆటగాళ్లు సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి మరో మెగా టోర్నీ నుంచి వైదొలిగారు. సాత్విక్ - చిరాగ్ జంట నిష్క్రమణతో లక్ష్య సేన్, పీవీ సింధులపైనే పతకం ఆశలు పెట్టుకుంది భారత్.
Satwik – Chirag : భారత స్టార్ డబుల్స్ ఆటగాళ్లు సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి మరో మెగా టోర్నీ నుంచి వైదొలిగారు. ఇప్పటికే గాయం కారణంగా స్విస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్ ముందే నిష్క్రమించిన ఈ జోడీ ప్రతిష్ఠాత్మక బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్షిప్స్(Badminton Asain Championships)లో ఆడడం లేదు. సాత్విక్ భుజం గాయంతో బాధ పడుతున్నందున టోర్నీ నుంచి వైదొలగుతున్నట్టు పీటీఐ(PTI) వార్తా సంస్థతో కోచ్ టాన్ కిమ్ హెర్ వెల్లడించాడు.
ఆ ఏడాది సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టిలకు కలిసి రావడం లేదు. ఈ మధ్య కాలంలో వీరిద్దరు ఫిట్నెస్ సమస్యలతో సతమతమవుతున్నారు. గాయం కారణంగా స్విస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో ఆడలేకపోయిన భారత జోడీ.. మరోసారి గాయం వల్లనే బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో ఆడడం లేదు. 2023లో విజేతగా నిలిచిన సాత్విక్ – చిరాగ్ జంట నిష్క్రమణతో లక్ష్య సేన్, పీవీ సింధులపైనే పతకం ఆశలు పెట్టుకుంది భారత్.
🚨 BREAKING 🚨
Satwiksairaj Rankireddy & Chirag Shetty pulled out from the Badminton Asia Championships due to Satwik’s shoulder injury. (PTI)#Badminton pic.twitter.com/L5YfTSdr0Q
— RevSportz Global (@RevSportzGlobal) April 6, 2026
పురుషుల సింగిల్స్‌లో సేన్, మహిళల సింగిల్స్‌లో సింధులు సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నారు. భుజం గాయం నుంచి కోలుకుంటున్న హెచ్‌హెస్ ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్‌లు బరిలో దిగుతున్నా ఇటీవలి ఫామ్ దృష్ట్యా పతకం ఖాయమని చెప్పలేం. బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో దినేశ్ ఖన్నా 1965 పురుషుల సింగిల్స్‌లో స్వర్ణ పతకం గెలుపొందాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘శ్రీకృష్ణం వందే జగద్గురుం’ కోలాట బృందానికి జాతీయ పురస్కారం
AP News | దక్షిణ బీహార్‌లా ఆంధ్రప్రదేశ్.. కూటమి సర్కారుపై వైఎస్ షర్మిల ఫైర్
‘నీటిని, కరెంటును పొదుపుగా వాడాలి’
కేతావత్ చంద్రు మృతి బాధాకరం : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
AP News | అధిష్టానాన్ని దిక్కరించి అభ్యర్థిని ప్రకటించుకున్న టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

