బాసెల్ : స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత ఆశలను పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి నిలబెట్టింది. శనివారం భారత జోడీ 21-19, 17-21, 21-17తో మలేషియా జంట ఆంగ్ యే సిన్-టో ఈ ఇపై గంట తొమ్మిది నిషాలలో గెలుపొంది ఫైనల్స్‌కు చేరుకున్నారు. ఆదివారం జరిగే ఫైనల్లో భారత జోడీ అన్‌సీడెడ్ చైనా ద్వయం రెన్ జియాంగ్ యు-టాన్ క్వియాంగ్తో తలపడతారు. అంతకుముందు జరిగిన క్వార్టర్ఫైనల్లో భారత జంట 15-21, 21-11, 21-14తో జెపీ బే-లస్సె మోల్హెడెపై గెలిచింది.