దోహ : డబ్ల్యుటిటి కంటెండర్ టేబుల్‌టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో భారత జోడి సాతియాన్-మనిక బత్రా క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నారు. బుధవారం జరిగిన పోరులో సాతియాన్-మనిక ఇంగ్లండ్‌కు చెందిన టిన్ టిన్ హొ-శామ్యూల్ వాకర్ జోడిపై 6-11,11- 8,8-11,11-7,11-8 స్కోరుతో 40 నిమిషాలలో గెలుపొందారు. గత నవంబరులో స్లొవేనియాలో జరిగిన టోర్నీలో రజత పతకం సాధించిన భారత జోడి తదుపరి రౌండ్లో స్పెయిన్‌కు చెందిన మరియ జియావొ-అల్వారొ రోబ్లెస్లను ఢీకొంటారు. పురుషుల సింగిల్స్‌లో భారత సీనియర్ ఆటగాడు ఆచంట శరత్‌కమల్ 11-8,11-9,11-8తో చైనీస్‌తైపీ ఆటగాడు చాంగ్ చి యువాన్‌పై గెలిచాడు.