Prithvi Shaw: పృథ్వీ షాపై దాడి.. సప్నా గిల్‌కు 14 రోజుల జుడిషియల్ కస్టడీ
prithvi shaw: పృథ్వీ షాపై దాడి చేసిన మహిళకు 14 రోజుల జుడిషియల్ కస్టడీ విధించారు. సెల్ఫీలు ఇవ్వలేదని ఆమె తన స్నేహితులతో కలిసి క్రికెటర్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ ఘటనకు సంబంధించి పలు సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు.
ముంబై: సోషల్ మీడియా ఇన్ప్లూయన్సర్ సప్నా గిల్(Sapna Gill)ను.. 14 రోజుల జుడిషియల్ కస్టడీ(Judicial custody)లోకి తీసుకున్నారు. క్రికెటర్ పృథ్వీ షా(Prithvi Shaw)పై ఆమె దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. సప్నా గిల్‌తో పాటు మరో ముగ్గురిని కూడా కస్టడీలోకి తీసుకున్నారు. షాపై దాడి కేసులో ఓషివారా పోలీసులు మొత్తం 8 మందిని అరెస్టు చేశారు. వారిపై ఐపీసీలోని 143, 148, 149, 384, 437, 504, 506 సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు. పృథ్వీ ఫ్రెండ్ ఆశిష్ సురేంద్ర యాదవ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గిల్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఓ హోటల్ వద్ద సెల్ఫీలు ఇచ్చేందుకు పృథ్వీ షా నిరాకరించడంతో.. సప్నా గిల్ తన మిత్రులతో కలిసి క్రికెటర్‌పై అటాక్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కారులో ఆ క్రికెటర్‌ను వెంటాడి మరీ .. బ్యాట్లతో దాడికి ప్రయత్నించారు. క్రికెటర్ నుంచి 50 వేల డిమాండ్ చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyber Crime | సైబర్ నేరాలకు కాంగ్రెస్ నేత మ్యూల్ ఖాతా!.. ప్రధాన నిందితుడు వెంకటేశ్ సహా నలుగురి అరెస్టు
YTPS | వైటీపీఎస్‌లో సీఈపై సస్పెన్షన్ వేటు.. రద్దు చేయాలని ఉద్యోగుల జేఏసీ వినతి
Congress | కాంగ్రెస్ నేత దౌర్జన్యం.. సంక్షేమ సంఘం కార్యదర్శిపై బూతుపురాణం
Smriti Mandhana | మంధాన శకంలో మొదటి అంకం.. నేడు జింబాబ్వేతో భారత్ తొలి టీ20
Jio Internet | జియోతో ఇంటర్నెట్ చౌక.. 6G సేవలపై ఎండీ ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

