Kanpur Test : టీ20 వరల్డ్ కప్ తర్వాత సొంతగడ్డపై తొలి టెస్టు సిరీస్ విజయంపై కన్నేసింది భారత జట్టు. చెపాక్ స్టేడియంలో బంగ్లాదేశ్ భరతం పట్టిన టీమిండియా కాన్పూర్ టెస్టు (Kanpur Test)లోనూ విజయ గర్జనకు సిద్ధమవుతోంది. అయితే.. కాన్పూర్‌లో స్పిన్నర్లు కీలకం కానున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకని ఈ మ్యాచ్‌లో మూడో స్పిన్నర్‌గా ఎవరిని ఆడించాలి?, ఏ పేసర్‌ను పక్కన పెట్టేయాలి? అనే విషయమై కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ గౌతం గంభీర్‌లు సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారు.
ఈ నేపథ్యంలో మాజీ ఆటగాడు, కామెంటేర్ అయిన సంజయ్ మంజ్రేకర్ (Sanjay Manjrekar) తుది జట్టును ఎంపిక చేశాడు. లోకల్ బాయ్ అయిన కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav) తుది జట్టులో ఉండాలని సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. ‘కాన్పూర్ టెస్టులో జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చి.. మూడో స్పిన్నర్‌గా కుల్దీప్ను ఆడించాలి. ఇక్కడి నల్ల మట్టి పిచ్‌పై కుల్దీప్ చాలా ప్రభావం చూపిస్తాడు. అందుకని అక్షర్ పటేల్ బదులు అతడినే ఆడించాలి అని’ ఆయన అభిప్రాయ పడ్డాడు.
📍 Kanpur#TeamIndia hit the ground running ahead of the 2nd #INDvBAN Test 🙌@IDFCFIRSTBank pic.twitter.com/EMPiOa8HII
— BCCI (@BCCI) September 26, 2024
అయితే.. కోచ్, కెప్టెన్లు మాత్రం ఆకాశ్ దీప్(Akash Deep)ను పక్కన పెట్టేసి.. అశ్విన్, జడేజాకు తోడుగా కుల్దీప్ లేదా అక్షర్ పటేల్‌లలో ఒకరిని తీసుకోవాలని అనుకుంటున్నారు. సొంత గడ్డపై మెరుగైన రికార్డు.. ఈ మధ్య నిలకడగా రాణిస్తున్న చైనామన్ బౌలర్ కుల్దీప్ వైపే వీళ్లిద్దరూ మొగ్గే అవకాశం ఉంది. అదే జరిగితే.. అక్షర్‌కు మరసారి ఎదురుచూపు తప్పదు. న్యూజిలాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌పై అతడు ఆశలు పెట్టుకోవాల్సి ఉంటుంది.
A journey full of smiles from Chennai to Kanpur 😃👌#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/awGef5q1Jd
— BCCI (@BCCI) September 25, 2024
భారత స్క్వాడ్ : రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, సిరాజ్, బుమ్రా, ఆకాశ్ దీప్, యశ్ దయాల్.
తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ను 280 పరుగుల తేడాతో ఓడించిన భారత్ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(WTC) పట్టికలో అగ్రస్థానం పదిలం చేసుకుంది. ఇక కాన్పూర్‌లోనూ జయభేరి మోగిస్తే టీమిండియా ఫైనల్‌కు మరింత చేరువైంది. న్యూజిలాండ్, ఆ తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ రోహిత్ సేన గెలిచిందంటే లార్డ్స్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడడం పక్కా.