ముంబై: టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ కోచ్ సంజయ్ బాంగర్ కుమారుడు ఆర్యన్ లింగ మార్పిడి చేయించుకున్నాడు. 23 ఏళ్ల ఆర్యన్ ఇప్పుడు అనయగా మారాడు. హార్మోన్ రిప్లేస్మెంట్(Hormone Replacement Surgery) సర్జరీ చేయించుకున్న అతను ఆ మార్పుకు చెందిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. 10 నెలల హార్మోన్ ట్రీట్మెంట్ తర్వాత.. ఆర్యన్ కాస్త ఎలా అనయగా మారిందో ఆ వీడియోలో చూడాల్సిందే. ఆర్యన్ ప్రస్తుతం మాంచెస్టర్‌లో నివసిస్తున్నాడు.
గతంలో ధోనీ, కోహ్లీలతో ఆర్యన్ ఫోటోలు దిగాడు. తన ట్రాన్స్ఫర్మేషన్ రీల్లో ఆ పిక్స్ పోస్టు చేశాడతను. ప్రొఫెషనల్ క్రికెటర్‌గా మారేందుకు ఎంతో త్యాగం చేశానని, ఎంతో పట్టుదలతో గేమ్ ఆడేవాన్ని అని, అలాగే తన జీవితంలో మరో జర్నీ కూడా సాగిందని, స్వీయ అన్వేషణ సాగించినట్లు ఆరన్య తన పోస్టులో పేర్కొన్నాడు. తండ్రి సంజయ్ బాంగర్ తరహాలోనే.. ఆర్యన్ కూడా క్రికెటర్. ఇస్లాం జింఖానా తరపున అతను క్రికెట్ ఆడాడు. లీసెష్టర్షైర్లోని హింక్లే క్రికెట్ క్లబ్‌కు కూడా అతను ఆడాడు.
ట్రాన్స్‌జెండర్ అథ్లెట్లకు క్రికెట్ ఆడే అవకాశాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి ఇటీవల ఎత్తివేసింది. వుమెన్స్ క్రికెట్లో లింగ మార్పిడి చేయించుకున్న క్రికెటర్లను ఆడనివ్వబోమని గత ఏడాది నవంబర్‌లో ఐసీసీ తెలిపింది. ఐసీసీ తీసుకున్న కొత్త నిర్ణయాన్ని ఆర్యన్ తప్పుపట్టాడు. తన రోజు వారి జీవితం గురించి ఆర్యన్ ఎప్పుడూ సోషల్ మీడియాలో అప్డేట్స్ ఇస్తూనే ఉంటాడు.
Sanjay Bangar’s son undergoes harmone replacement surgery.
Aryan becomes Anaya!
Have a look at Ananya’s instagram post!#Cricket #CricketTwitter #SanjayBangar pic.twitter.com/esePJjf4Ua
— Amit T (@amittalwalkar) November 10, 2024