సౌథాంప్టన్: వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు ముందు టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తన ఇన్‌స్టాగ్రామ్‌లోని మరపురాని ఫొటోల గురించి చెప్పాడు. ఐసీసీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ ఇంటర్వ్యూని అతని భార్య, టీవీ ప్రెజంటర్ సంజనా గణేషన్ చేయడం విశేషం. ఇంటర్వ్యూకి వస్తున్న సమయంలో అక్కడ రెడీగా ఉన్న సంజనను చూసిన బుమ్రా.. ఇంతకుముందు నిన్నెక్కడో చూశానే అని అంటాడు. దానికి ఆమె నేను ఇక్కడే ఉంటాను అని చెప్పింది.
ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలి, తనను తాను ఎలా పరిచయం చేసుకోవాలో కూడా బుమ్రాకు సంజననే వివరిస్తుంది. ఆ తర్వాత తాను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన మరుపురాని ఫొటోలను బుమ్రాకు చూపిస్తూ వాటి గురించి చెప్పాలని సంజన అడుగుతుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో ఉన్న ఫొటో, తాను గిటార్ వాయిస్తున్న ఫొటో, సంజనతో పెళ్లి ఫొటోల గురించి బుమ్రా చెప్పాడు. తన పెళ్లి ఫొటోను చూస్తూ ఇది తన జీవితంలో మరుపురాని రోజు అని, ఈ మధ్యే ఈ అద్భుతం జరిగిందని బుమ్రా చెప్పడం విశేషం. ఐసీసీ ఈ ఇంటర్వ్యూని తన ట్విటర్లో పోస్ట్ చేసింది.
Playing with his sister, starring in school cricket and ‘the best day’ of his life.@SanjanaGanesan takes @Jaspritbumrah93 through some Insta Memories before the #WTC21 Final 🎥 pic.twitter.com/k8FKUxgQJI
— ICC (@ICC) June 17, 2021