IPL 2025 : జైపూర్ వేదికగా జరుగుతున్న డబుల్ హెడర్ రెండో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) పేసర్లు విజృంభిస్తున్నారు. భీకర ఫామ్‌లో ఉన్న జోఫ్రా ఆర్చర్.. తన రెండో ఓవర్లోనే ఓపెనర్ మిచెల్ మార్ష్(4)ను పెవలియన్ పంపాడు. ఆ తర్వాత వచ్చిన డేంజరస్ నికోలస్ పూరన్(11)కు 7 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద లైఫ్ లభించింది.
అయితే.. రౌండ్ ది వికెట్ వేసిన సందీప్ శర్మ అతడిని ఎల్బీగా ఔట్ చేసి రాజస్థాన్‌కు బిగ్ బ్రేకిచ్చాడు. దాంతో లక్నో పవర్ ప్లేలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం కెప్టెన్ రిషభ్ పంత్(0), ఎడెన్ మర్క్రమ్ (29)లు క్రీజులో ఉన్నారు. 6 ఓవర్లకు లక్నో స్కోర్.. 46-2.