హైదరాబాద్, ఆట ప్రతినిధి : కాకినాడ వేదికగా జరిగిన 13వ జాతీయ స్కూల్ చెస్ చాంపియన్‌షిప్‌లో రాష్ర్టానికి చెందిన సంహిత పుంగవనం స్వర్ణ పతకంతో మెరిసింది. ఐదు రోజుల పాటు సాగిన టోర్నీలో బాలిక అండర్-11 విభాగంలో బరిలోకి దిగిన సంహిత 7.5/9 పాయింట్లు సాధించి టైటిల్ విజేతగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రిశిత రెండో స్థానం దక్కించుకుంది. ఈ ఏడాది ఏషియన్ టోర్నీతో పాటు వరల్డ్ స్కూల్ పోటీల్లో సంహిత బరిలోకి దిగుతున్నది.