మెల్బోర్న్: సామ్ కాన్స్టాస్(Sam Konstas) ఇప్పుడు ఆస్ట్రేలియా స్టార్. 19 ఏళ్ల కుర్రాడు ఇప్పటికే ఆసీస్ డొమెస్టిక్ లీగ్‌లో ఓ సెన్షేషన్ క్రియేట్ చేశాడు. ఇక ఇవాళ మెల్బోర్న్ టెస్టు తొలి రోజే.. అతని తన డ్యాషింగ్ బ్యాటింగ్ స్టయిల్‌ను ప్రదర్శించాడు. బాక్సింగ్ డే టెస్టులో అరంగేట్రం చేసిన ఆ టీనేజర్.. తన స్ట్రోక్స్‌తో కదం తొక్కాడు. బుమ్రా పేస్ బౌలింగ్‌లో.. రివర్స్ స్కూప్ షాట్లు ఆడి మెల్బోర్న్ ప్రేక్షకుల్ని మెప్పించాడు. బుమ్రా వేసిన రెండు ఓవర్లలో అతను తన హిట్టింగ్తో 32 రన్స్ స్కోర్ చేశాడు.
సుమారు 88 వేల మంది ప్రేక్షకుల ముందు తన నేచురల్ గేమ్ ఆడేందుకు కాన్స్టాస్ వెనుకాడలేదు. చాలా ఈజీగా ఇండియన్ పేసర్లను అటాక్ చేశాడు. 65 బంతుల్లో 60 రన్స్ చేసిన కాన్స్టాస్.. రవీంద్ర జడేజా బౌలింగ్ ఎల్బీడబ్ల్యూ అవుట్ అయ్యాడు. ఓపెనర్ మెక్‌స్వీనే తొలి మూడు టెస్టుల్లో విఫలం కావడంతో.. యువ బ్యాటర్ కాన్స్టాస్కు ఈ మ్యాచ్‌లో అవకాశం కల్పించారు. దాన్ని సద్వినియోగం చేసుకున్నాడా టీనేజర్.
Ravi Jadeja gets Sam Konstas!
The end of a very entertaining knock. #AUSvIND pic.twitter.com/OiY2WZg0GV
— cricket.com.au (@cricketcomau) December 26, 2024
బుమ్రా వేసిన నాలుగవ ఓవర్లో కాన్స్టాస్.. ఫైన్ లెగ్ దిశగా స్కూప్ షాట్ ఆడాడు. డీప్ థార్డ్ వికెట్ దిశగా రివర్స్ స్కూప్లో సిక్సర్ కొట్టాడు. ఆ తర్వాత మూడు బంతుల వ్యవధిలో అలాగే మరో షాట్ ఆడాడు. బుమ్రా వేసిన బౌలింగ్‌లో ఓ ఓవర్లో 14 రన్స్, మరో ఓవర్లో 18 రన్స్ రాబట్టాడు కాన్స్టాస్. 52 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. తన అటాకింగ్ స్ట్రోక్‌ప్లేతో ఎంటర్టైన్ చేసిన కాన్స్టాస్ను ఓ దశలో క్రీజ్‌పై కోహ్లీ ఢీకొన్నాడు.