న్యూఢిల్లీ: హంగ్జౌ(చైనా) వేదికగా సెప్టెంబర్ 5 నుంచి 14వ తేదీ వరకు జరిగే ఆసియా కప్ టోర్నీ కోసం భారత మహిళల హాకీ జట్టును ప్రకటించారు. గురువారం సమావేశమైన హాకీ ఇండియా(హెచ్ఐ) సెలెక్షన్ కమిటీ స్టార్ మిడ్‌ఫీల్డర్ సలీమా టెటె సారథ్యంలో 20 మందితో కూడిన టీమ్‌ను ఎంపిక చేసింది. పూల్-బిలో భారత్‌తో పాటు జపాన్, థాయ్‌లాండ్, సింగపూర్ ఉన్నాయి. తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 5న థాయ్‌లాండ్‌తో టీమ్ఇండియా తలపడుతుంది.
ఆ తర్వాత జపాన్, సింగపూర్‌తో ఆడుతుంది. ఆసియా కప్ టోర్నీకి జట్టు ఎంపికపై చీఫ్ కోచ్ హరేంద్రసింగ్ సంతోషం వ్యక్తం చేశారు. అనువజ్ఞులు, యువ ప్లేయర్లతో జట్టు సమతూకంగా కనిపిస్తున్నదని అన్నారు. ఆసియా టోర్నీ కోసం అన్ని విధాలుగా సిద్ధమయ్యామని పేర్కొన్నారు. ఆసియా కప్ టైటిల్ గెలిచిన జట్టు వచ్చే ఏడాది జరిగే హాకీ ప్రపంచకప్ టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తుంది.